కసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్యుతాపురం వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్... ఏపీలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు, కేసీఆర్కు చెప్పరంటా అని ఎద్దేవా చేసిన ఆయన.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందని సూచించారు
మా విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు అని చెప్పుకొచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్... తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటకు వెళ్తే భూములకు ధర ఎక్కడుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలని కూడా ప్రజలు నమ్మరని సూచించారు .
విశాఖలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్.. నగరంలో కలకలం రేగింది. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్ అయ్యారంటూ ఎంపీ సత్యనారాయణ.. విశాఖ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.