Steel Man: ఉక్కు మనిషి.. సెంచరీ దాటేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steel Man: ప్రస్తుత జీవన శైలితో మానవుని సగటు జీవితం 60 నుంచి 70 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ గత జనరేషన్ వారు అక్కడక్కడా సెంచరీ వయస్సు దాటినా వారు కూడా కనిపిస్తుంటారు. అయితే సెంచరీ దాటిన వారు ఇంట్లోనే ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడో స్టీల్ మ్యాన్ ఉన్నాడు. ఆయన వయస్సు సెంచరీ దాటింది. అయినా ఇప్పటికీ ఉక్కు మనిషిలాగా ఉంటాడు.. చాలా చలాకీగా ఉన్నాడు. పైగా ఆయన అంతర్జాతీయ అథ్లెట్ కావడం మరో విశేషం.. ఈ ఏడాది చివర్లో.. వచ్చే ఏడాదిలో జరిగే అథ్లెటిక్ పోటీల్లోనూ పాల్గొంటున్నారు.. ఇంతకీ ఎవరా? ఉక్కు మనిషీ.. ఏమీటా? కథ అనుకుంటున్నారా? అయితే ఆలస్యమెందుకు.. ఇది చదవండి..
Read also: Mitali Sharma: ఆత్రం ఆగలేదు.. పోస్టింగ్ వచ్చినరోజే లంచం తీసుకుంది.. అరెస్ట్ అయింది
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
రోజుకు రెండు మూడు గంటల నడక.. ఎనిమిది గంటల నిద్ర.. కొద్దిసేపు వ్యాయామం.. ఒంటిపూట భోజనం.. మితాహారం.. ఇది ఆయన రోజువారీ జీవన శైలి.. దాదాపు యాభై ఏళ్ల నుంచి ఇదేవిధంగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు వందేళ్లు దాటాయి… అయినా ఇప్పటికీ తన జీవన శైలిలో మార్పు లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.. ఆయన ఈ రోజు తన 101 ఏట అడుగు పెడుతున్నారు. ఆయనే పేరు వి శ్రీరాములు.. సొంతరూ మచిలీపట్నం.. స్థిరపడింది విశాఖపట్నం. 1923 జూలై 18న దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన తన 21వ ఏట అంటే 27 మార్చి 1944లో అప్పటి రాయల్ ఇండియన్ నేవీలో చీఫ్ పెట్టీ ఆఫీసర్‌గా చేరారు. 1979 డిసెంబర్ 31న కమాండర్ హోదాలో పదవీ విరమణ చేసి విశాఖలో స్థిరపడ్డారు. దేశంలో నేవీలో పనిచేసి వందేళ్లకు పైగా జీవించి ఉన్న ఏకైక అథ్లెట్ శ్రీరాములు నేడు 101వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
Read also: Amala Paul: కొండల అందాలను కొంటెగా ఎంజాయ్ చేస్తున్న అమలాపాల్
రిటైర్‌మెంట్ తరువాత రేస్ వాకింగ్‌తో పాటు రన్నింగ్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో వంటి ఆటల్లోనూ సత్తా చాటుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. ఏసియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 5, 10, 20 కి.మీ. రేస్ వాకింగ్ పోటీల్లో 9 బంగారు, 5 రజత, 2 కాంస్య పతకాలు, వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ప్స్‌లో 5 బంగారు, 3 రజత పతకాలను కైవసం చేసుకున్నారు. వెటరన్స్ (మాస్టర్స్) కేటగిరీలో ఇప్పటికీ ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొంటూ బంగారు, రజత, కాంస్య పతకాలను సాధిస్తూనే ఉన్నారు. పర్వతారోహణంపైనా మక్కువ ఉన్న శ్రీరాములు 79వ ఏట తన కుమారుడు సాగర్‌తో కలిసి 2002లో ఆఫ్రికాలోని కిలీమాంజారో, 81వ ఏట 2004లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు, 83వ ఏట హిమాలయాల్లోని పిండారీ గ్లేసియర్‌లను అధిరోహించారు.
Read also: Janhvi Kapoor: కుక్కతో క్యూట్ గర్ల్ జాన్వీ
శ్రీరాములు 101వ ఏట ఈ ఏడాది నవంబరు 8–12 వరకు ఫిలిప్పీన్స్‌లో జరిగే ఏసియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ కాంపిటిషన్స్‌లో, వచ్చే ఏడాది జూన్‌లో స్వీడన్‌లో నిర్వహించే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్–2024 పోటీలకు సిద్ధమవుతున్నారు. వందేళ్ల వయస్సులోనూ ఆయన పుస్తకాలు బాగా చదువుతారు. ఆస్ర్టానమీ, జియో పాలిటిక్స్, నేవీకి సంబంధించిన అంశాలపై ఆసక్తి కనబరుస్తారు. పిల్లలు స్థిరపడటంతో తన భార్యతో కలిసి విశాఖలో ఉంటున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!