RK Beach : విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. యువతి అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Tragedy : శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మంగరాజు రాజబాబు ఆమదాలవలస మండలం ఈసర్లపేట గ్రామం.
Vizag Steel Plant EOI Bidding : విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. సింగరేణి కాలరీస్ భాగస్వామ్యంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కార్మిక సంఘాలు.. EOIకి సిద్ధమేనని ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి లేఖ సమర్పించింది సింగరేణి.. అయితే, ఆన్ లైన్ విధానంలో బిడ్ దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది.. దీంతో, సింగరేణి కాలరీస్ నిర్ణయం కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు.. EOIపై సింగరేణి వైఖరి ఆధారంగా…
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాజధానిపై కీలక ప్రకటన చేశారు.. సంతబొమ్మాళి మండలం నౌపాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా.. కాపురం కూడా విశాఖకు మారుతున్నాను.. అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అంటూ వ్యాఖ్యానించారు.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తాను.. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.. ఇక, ఉద్దానం కిడ్నీ సమస్యల…
Vizag steel plant: విశాఖ ఉక్కు పోరాటం ఉధృతం అవుతోంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సుదీర్ఘ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి.. కార్మికుల పోరాటానికి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచియి.. ఇక, ఇవాళ విశాఖ ఉక్కుపోరాట కమిటీ మహాపాదయాత్ర నిర్వహించింది.. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం ఆలయం వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఉదయం 11 గంటలకు సింహాచంలో ముగిసింది.. తొలిపావంచ…
JD Lakshminarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ చెబుతూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ముందుకు వెళ్లడంలేదని ప్రకటించింది. అయితే, అంతకుముందే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల బృందం స్టీల్ ప్లాంట్లో పర్యటించడంతో.. ఆ ప్రకటన తర్వాత క్రెడిట్ గేమ్ నడిచింది.. మా పోరాటం వల్లే కేంద్రం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందంటే.. లేదు మా వల్లే అంటూ అంతా హడావిడి స్టార్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో.. స్టీల్ ప్లాంట్ విషయంలో…
Pawan Kalyan: రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.. సోషల్ మీడియా వేదికగా రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందన్నారు. వైఎస్ఆర్…
Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న సమయంలో.. కీలక మలుపు తిరిగినట్టు అయ్యింది.. విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఫగ్గన్.. విశాఖలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదన్నారు.. దానికంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే…
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖపట్నం తూర్పు ఒకటి. టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణ బాబు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. 2009,14,19ల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు బ్రేకులు వేసేందుకు ఒకసారి పీఆర్పీ, రెండు సార్లు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడ ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా అంతంత మాత్రమే. అయినా… వెలగపూడికి మెజారిటీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రజలతో సత్సంబంధాలు, వర్గ…