CM YS Jagan: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బాధితులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని స్పష్టం చేశారు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి సీదిరి అప్పలరాజుని ఆదేశించారు సీఎం జగన్. ఇక, బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని అధికారులకు సూచించారు.
Read Also: Stock Market Opening: స్టాక్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్.. సెన్సెక్స్-నిఫ్టీలో కొరవడిన ఉత్సాహం
కాగా, విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిలిచింది.. మత్స్యకారులందరూ గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం గంగపుత్రులకు కాళరాత్రిగా మారింది.. ఒకటి కాదు రెండు కాదు సుమారు 50 బోట్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి.. ఈ ప్రమాదంలో 40 కోట్ల రూపాయలు వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.. ఎవరో ఆకతాయిలు చేసిన పని వందలాదిమంది మత్స్యకార కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న జీవనాధారమైన బోట్లు కళ్ల ఎదుట అగ్నికి ఆహుతి అయిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.
Read Also: Maxico : మెక్సికోలో పెను ప్రమాదం.. కూలిన టవర్.. ఐదుగరు కార్మికులు మృతి
అయితే, అగ్ని ప్రమాదం ఘటనలో ఓ యూట్యూబర్ పై కేసు నమోదు చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. నిన్న రాత్రి ఫిషింగ్ హార్బర్ లో పార్టీ ఇచ్చాడట ఓ యూట్యూబర్.. మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. యూట్యూబర్ పరారీలో ఉన్నట్టుగా సమాచారం.. అయితే, యూట్యూబర్ ను పట్టుకోవడానికి మూడు బృందాలను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది.