సినీ మాటల రచయిత రాజసింహపై ప్రముఖ నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద (వివేక్ కూచిబొట్ల) పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం… ఫిల్మ్నగర్ రోడ్ నంబరు 76లో వివేకానంద నివసిస్తుంటారు. ఆయనకు రాజసింహతో చాలా కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే కొన్ని కథలు చెబుతానంటూ చాలా కాలంగా ఆయన వద్దకు వస్తున్నాడు. కథల విషయంలో ఏర్పడిన మనస్పర్ధల నేపథ్యంలో వివేకానంద కుటుంబ సభ్యులకు రాజ సింహ అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలను…