Rajasimha Tadinada: స్టార్ ప్రొడ్యూసర్ పై అనుచిత వ్యాఖ్యలు… రైటర్ పై పోలీస్ కేస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ మాటల రచయిత రాజసింహపై ప్రముఖ నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద (వివేక్ కూచిబొట్ల) పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం… ఫిల్మ్నగర్ రోడ్ నంబరు 76లో వివేకానంద నివసిస్తుంటారు. ఆయనకు రాజసింహతో చాలా కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే కొన్ని కథలు చెబుతానంటూ చాలా కాలంగా ఆయన వద్దకు వస్తున్నాడు. కథల విషయంలో ఏర్పడిన మనస్పర్ధల నేపథ్యంలో వివేకానంద కుటుంబ సభ్యులకు రాజ సింహ అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలను పంపాడు. నిర్మాత ప్రతిష్టను అగౌరవపర్చే రీతిలో సామాజిక మాధ్యమాల్లోనూ సందేశాలు పెట్టాడు. తననే కాకుండా దర్శకుడు రాఘవేంద్రరావు, వీఎన్ ఆదిత్య, వైవీ ఎస్ చౌదరి, ఠాగూర్ మధులాంటి వారిని సైతం దూషిస్తూ సందే శాలు పెట్టాడని కూచిబొట్ల గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు…
రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ తో ఎండార్స్మెంట్స్ కూడా చేసిన రాజసింహ, ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వర్క్ చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి పేరొచ్చింది. ఈ క్రేజ్ తో దర్శకుడిగా మారిన రాజసింహ తడినాడ, సందీప్ కిషన్ తో ‘ఒక అమ్మాయి తప్ప’ అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో రాజసింహకి సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే పర్సనల్ లైఫ్ లో ఉన్న ఇబ్బందుల కారణంగా రాజసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటినుంచి రాజసింహ బయట పెద్దగా కనిపించడం మానేసాడు.
Also Read

తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!