US Visit : ప్రధాని మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం.. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Visit : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కోసం తాము వేయి కళ్లతో ఎదురు చూస్తు్న్నట్టు అమెరికా కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రధాని మోడీ అమెరికా పర్యటన చేయనున్న నేపథ్యంలో .. మోడీ పర్యటన కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్టు అమెరికా కాంగ్రెస్ సభ్యులు వీడియోలు విడుదల చేశారు. నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూఎస్ పర్యటన సందర్భంగా జూన్ 22న ప్రతినిధుల సభ, సెనేట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం యూఎస్ కాంగ్రెస్ ఇటీవల ప్రధాని మోదీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో రెండోసారి ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని ప్రధాని మోడినే.
Read also: AAA Cinemas: సొంత మల్టీప్లెక్స్ లాంఛ్ చేసిన బన్నీ
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ప్రధాని మోదీ చేసే ప్రసంగం కోసం తాము ఎదురుచూస్తున్నామని పలువురు అమెరికా కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. భారత ప్రధాని అమెరికా పర్యటన ప్రాముఖ్యత గురించి కూడా వారు మాట్లాడారు. భారత ప్రధానమంత్రి మోదీ ఇక్కడికి రావడం, ఆయన పర్యటనలో చేయనున్న సంభాషణలు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నానని యూఎస్ ప్రతినిధుల సభ సభ్యులు రిచర్డ్ మెక్‌కార్మిక్ తెలిపారు. భారతదేశం ప్రాముఖ్యత గురించి ఆలోచించని వారు ఎవరుండరని అన్నారు. డబ్ల్యూటీవో నిబంధనలను ఉల్లంఘించకుండా వాటిని అనుసరిస్తున్న దేశం ఇండియానని.. తమకు అలాంటి భాగస్వామి కావాలన్నారు.
Read also: T Series: టాలీవుడ్ పై కన్నేసిన టీ సిరీస్.. హైదరాబాద్ లో పాగా!
వచ్చే వారం యూఎస్ దేశ రాజధానికి భారత ప్రధాని మోదీని స్వాగతించడానికి తాను సంతోషిస్తున్నట్టు యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి బడ్డీ కార్టర్ తెలిపారు. అమెరికా-భారత్ బంధం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనదని ఆయన అన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ చేసే ప్రసంగం కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోందని అమెరికా కాంగ్రెస్‌లో మహిళా సభ్యురాలు షీలా జాక్సన్ లీ అన్నారు. కాంగ్రెస్ ఉభయ సభలు కూడా ఎదురుచూస్తున్నాయని.. తాము కలిసి చేసే అన్ని పరిష్కారాల కోసం ఎదురుచూస్తామని చెప్పారు.
- Tags
- Members
- modi
- US Congress
- USA
- visit
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!