యంగ్ హీరో విశాల్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నవంబర్ 4న ఆయన నటించిన “ఎనిమీ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘ఎనిమీ’ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ కాలినడకన తిరుమల కొండను ఎక్కారు విశాల్. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న విశాల్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ “పునీత్ మా ఇంట్లో మనిషి…ఇన్ని రోజులైనా మా మనస్సులో అలాగే వున్నాడు. పునీత్ నిర్వహిస్తున్న కార్యక్రమం ఆగకూడదు అనే ఉద్దేశ్యంతోనే 1800 మంది విద్యార్థుల బాధ్యత తీసుకున్నాను. ఇల్లు కొనాలనుకుని సమకూర్చుకున్న డబ్బును విధ్యార్దులు చదువుకు కేటాయిస్తున్నాను” అని అన్నారు.
Read Also : పునీత్ రాజ్ కుమార్ పై అవమానకర పోస్ట్… నెటిజన్ అరెస్ట్
ఇక ఆయన నటించిన ‘ఎనిమీ’ సినిమా విషయానికొస్తే… “ఎనిమీ” చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “ఎనిమీ” నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కానుంది.