వీసాల జారీలో కొర్రీలు పెట్టే అగ్రరాజ్యం.. ఈసారి మాత్రం భారతీయులకు వీసాలు వచ్చే విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఏకంగా రికార్డు స్థాయిలో భారతీయులకు వీసాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా.. ఇక నుంచి ఆ దేశానికి వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ద్వీప దేశం పర్యాటక రంగాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల మధ్.. భారతదేశం, ఇతర ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలు జారీ చేసే విధానాన్ని శ్రీలంక మంత్రివర్గం ఆమోదించిందని విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఈరోజు తెలిపారు.
చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టుకు ఆ దేశం వీసా గడువును పొడిగించకపోవడంతో ఈ నెలాఖరు నాటికి చైనా నుంచి భారతీయ జర్నలిస్టులందరూ ఇండియాకు తిరిగి వచ్చేసినట్టు అవుతుంది
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు.
అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం.. విద్వేషపూరితంగా సందేశాల్ని వ్యాప్తి చేయటం.. ఫోటోల్ని మార్ఫింగ్ చేసే ఉదంతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. అమాయకుల ఫోటోల్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి.. అసభ్యకర పదజాలంతో పోస్టు చేస్తూ వేధింపులకు గురిచేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. సోషల్ మీడియాలో అసత్యాల్ని వ్యాప్తి చేసే వారి పై కేసుల్ని నమోదు చేయటంతో పాటు.. వేగవంతంగా శిక్షలు…