నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతాను అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పెట్టి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను.. యువత భవిష్యత్ కోసం పోరాడుతుంటే అవమానాలు, వెటకారాలు చేస్తున్నారు.. అయినా వాటిని భరించడానికి సిద్ధం అన్నారు. ఉత్తరాంధ్ర చైతన్యం కలిగిన నేల, అటువంటి చోట నుంచి వలసలు ఆగాలి అని ఆకాక్షించారు.
రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వాసుపల్లి, తిప్పల నాగిరెడ్డి విశాఖ కలెక్టర్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలని.. వినత పత్రం సమర్పించారు.
నేడు విశాఖపట్నంలో ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ జరుగనుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు చేరనునన్నారు. ఇక, మధ్యాహ్నం నగరానికి జనసేన చీఫ్ రానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యలు, తుఫాన్ నష్టం, రైతులు పడుతున్న ఇబ్బందులు, తాజా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారని పార్టీ వర్గాల వెల్లడించాయి.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ ఘటనపై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2020లో ఘటన జరిగినపుడు 15 మంది మృతి చెందారు.
విశాఖపట్నంలోని జూపార్క్‌లో ఉదయం విషాదం చోటుచేసుకుంది. జూపార్క్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నగేష్ అనే జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా.. అతనిపై దాడి చేయగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోట్ల దగ్ధం కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 6 రోజులకు అసలు నిందితులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించనున్నారు. సుమారు 47 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉదారతను చాటుకున్నారు. ఇటీవల ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందజేసన జనసేన పవన్ కళ్యాణ్. శుక్రవారం విశాఖలో పర్యటించిన పవన్ ఈ సందర్భంగా మత్స్య కారులకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘వైసీపీతో సహా మిగిలిన రాజకీయ పార్టీల్లా నేను ఎప్పుడు మత్స్యకారులను ఓట్ బ్యాంకులా చూడలేదు. మీరు…
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ నుంచే పరిపాలన విషయంలో కీలక పరిణామం జరిగింది. విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.