Vizag Crime: విశాఖపట్నంలో కలకలం సృష్టించిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఇక, అరెస్ట్ అయిన 11 మంది నిందితులు ఫొటోగ్రాఫర్లే.. అరెస్ట్ తర్వాత వారిని కోర్టుముందు హాజరుపర్చగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.. ఈ కేసులో మరో ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. కీలక నిందితుడిగా ఉన్న బాలిక ప్రియుడు ఇమ్రాన్‌తో పాటు అతని స్నేహితుడు షోయాబ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
Read Also: NTR: దేవర గ్లిమ్ప్స్ ముందున్న టార్గెట్ ఇదే… 24 గంటల్లో అన్ని లైకులా సాధ్యమేనా
కాగా, విశాఖలో 17 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం తీవ్ర కలకలం సృష్టించింది.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి నరకం చూపించారు కామాంధులు.. నగరంలోని పలు లాడ్జిలకు తిప్పుతూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఒడిశా నుంచి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను ప్రేమపేరుతో వంచించి ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తర్వాత మరో తొమ్మిది మంది బాలికను రెండు రోజుల పాటు లాడ్జిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ ఘటనలో 13 మందిని కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also: Whatsapp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా..
ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖలోని కంచరపాలెంలో నివసిస్తోంది. రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో ఆ బాలికకు కుక్కలకు ఆహారం పెట్టే పని కుదిరింది. భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమెను ప్రియుడు ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తన పాడుబుద్ధికి పనిచెప్పాడు.. తన స్నేహితుడిని అత్యాచారానికి ప్రోత్సహించాడు.. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకొనేందుకు ఆరే బీచ్ కు వెళ్లింది. కానీ, పెనం పైనుంచి ఆ బాలిక పొయ్యిలో పడినట్టు అయ్యింది.. ఎందుకంటే.. అక్కడ పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి జగదాంబ కూడలి సమీపంలోకి ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో సహా ఎనిమిది రెండు రోజుల పాటు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ బాలికకు నరకం చూపించారు.. తమ కూతురు కనిపించడం లేదంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక, దళిత బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.