బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనుమ రోజున విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఓ రిక్షావాలాను కూర్చోబెట్టుకుని జీవీఎల్ రిక్షా తొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. తర్వాత.. ఆ రిక్షా కార్మికుడికి కొంత డబ్బులు ఇచ్చారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పండింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీలలో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది.
Indore: దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మరోసారి ఇండోర్ నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 అవార్డుల్లో భాగంగా ఏడోసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. ఇండోర్, సూరత్ నగరాలు దేశంలో పరిశుభ్రమైన నగరాలుగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.
విశాఖలో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Road Accident: లారీని ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు! పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో శ్యామల…
Japan Earthquake : నేడు సముద్రం అలలను చూసిన విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం సముద్రం తిరోగమనం. అయితే ఇలా జరగడానికి గల కారణాలేమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
విశాఖపట్నంలో కలకలం సృష్టించిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఇక, అరెస్ట్ అయిన 11 మంది నిందితులు ఫొటోగ్రాఫర్లే.. అరెస్ట్ తర్వాత వారిని కోర్టుముందు హాజరుపర్చగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.. ఈ కేసులో మరో ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. కీలక నిందితుడిగా ఉన్న బాలిక ప్రియుడు ఇమ్రాన్‌తో పాటు…
విశాఖపట్నంలో కోవిడ్ కేసులు ఉధృతి పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువైంది. తాజాగా 10 మందికి వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో.. ఈ సీజన్లో కరోనా భారినపడ్డ బాధితుల సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆస్పత్రులు, హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.