విశాఖలో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Road Accident: లారీని ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు!
పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో శ్యామల అనే మహిళ నివాసం ఉంటోంది. శ్యామల కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం శ్యామల సోఫాలో కూర్చుని ఉండగా.. గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో ఆమె సోఫాలోనే కన్నుమూసింది. ఇది గుర్తించని కుమారుడు.. ఐదు రోజులుగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే ఉంటున్నాడు. చుట్టుపక్కల వారికి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. తలుపులు తట్టగా ఎవరూ తీయలేదు. దాంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. కుళ్లిన స్థితిలో శ్యామల మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.