దేశం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కట్టుబడి ప్రణాళికలు రూపొందించడం మా ప్రభుత్వం లక్ష్యం.. దేశ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం.. బీజేపీ.. నాన్ బీజేపీ ప్రభుత్వాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి అని సూచించారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.
విశాఖపట్నంలో నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి జోరుగా సాగుతుంది. తాజాగా, నగరంలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ కరెన్సీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్ల కాగితలను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ మోసం చేశారు. బ్లాక్ కరెన్సీ ముఠాను టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం (IIMV) శాశ్వత క్యాంపస్ ప్రారంభానికి సిద్ధమైంది. నగర శివారున ఆనందపురం మండలం గంభీరంలో 436 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ క్యాంప్సను ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు పవన్ విశాఖకు రానున్నారు. సాయంత్రం ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేర్వేరుగా మాట్లాడనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. ఆడుదాం - ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు.. దీని కోసం పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. సాయంత్రం 5.45 గంటలకు మధురవాడ హిల్ నెంబర్ 3 కి హెలిప్యాడ్ కు చేరుకోనున్న సీఎం.. 6 గంటలకు PM పాలెం స్టేడియంలో క్రికెట్ అభిమానులను కలుసుకుని, క్రీడాకారులను అభినందనలు తెలుపుతారు..
ప్రేమ పేరుతో నమ్మించి.. శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడమే కాకుండా స్లో పాయిజన్ ద్వారా చంపాలని చూశాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కి చెందిన మాధురి, శేఖర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
గోదావరి ఎక్స్ప్రెస్ రైలు నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖ ముద్దుబిడ్డ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకుంది. 50ఏళ్ల క్రితం విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య ప్రారంభమైన రాకపోకలు నిరంతరాయంగా కొనసాగిస్తోంది గోదావరి ఎక్స్ప్రెస్.
ఉప్పల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. అందుకోసం ఇండియా-ఇంగ్లాండ్ విశాఖకు చేరుకున్నాయి. దీంతో విశాఖలో క్రికెట్ సందడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు పీఎం పాలెంలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగననుంది. అందుకోసం.. ప్రత్యేక విమానంలో ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్స్ విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. దీంతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని.. అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని స్పష్టం చేశారు.