ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు జకోవిచ్‌కు ఆస్ట్రేలియా కోర్టు షాకిచ్చింది. తన వీసాను పునరుద్ధించుకోవడానికి జకోవిచ్ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా… అక్కడ చుక్కెదురైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా జకోవిచ్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు ప్రయత్నించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేయడం సబబేనని కోర్టు ఏకీభవించింది. జకోవిచ్‌ను ఆస్ట్రేలియా నుంచి తిప్పిపంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫెడరల్ కోర్టు మద్దతు పలికింది. Read Also: అది కోహ్లీ…
సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా జకోవిచ్ వీసాను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ చేరుకున్న జకోవిచ్‌ను విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్ తగిన ఆధారాలు సమర్పించలేదని.. అందుకే అతడి ఎంట్రీని అడ్డుకున్నామని ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ ఆరోపించింది. దీంతో 8 గంటల పాటు జకోవిచ్ మెల్‌బోర్న్ విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. Read Also: 2021 హార్ట్ బ్రేకింగ్…