భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలోనూ నిరాశ పరిచాడు. పెర్త్ వన్డేలో 8 బంతులు ఆడి డకౌట్ అయిన కోహ్లీ.. అడిలైడ్ వన్డేలో నాలుగు బంతులు ఆడి ఖాతా తెరవలేదు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. రెండు వన్డేల్లో నిరాశపరచడంతో ఫాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కింగ్ తన వన్డే కెరీర్‌లో ఇలా వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అవ్వడం ఇదే మొదటిసారి. అవుట్ అయిన అనంతరం…
అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. 265 పరుగుల టార్గెట్‌ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. మొదటి రెండు వన్డేల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుంది. 17 సంవత్సరాల తర్వాత అడిలైడ్ ఓవల్‌లో భారత్ వన్డే మ్యాచ్‌ను ఓడిపోయింది. భారత్ వన్డే సిరీస్ ఓటమికి ప్రధాన కారణాలు…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (73; 97 బంతులు, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (61; 77 బంతులు, 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. అక్షర్ పటేల్ (44; 41 బంతులు, 5…
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలు చివరగా భారత జెర్సీల్లో కనిపించి 223 రోజులైంది. ఇద్దరు దిగ్గజాలు గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఆడారు. సుదీర్ఘ విరామం తర్వాత రో-కోలను అంతర్జాతీయ క్రికెట్లో చూడబోతున్నామని ఫాన్స్ సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో రోహిత్-కోహ్లీలు పూర్తిగా నిరాశపర్చారు. రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. జోష్…
Virat Kohli Duck in IND vs NZ 1st Test: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న విరాట్.. పరుగుల ఖాతానే తెరవలేదు. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ పట్టడంతో కింగ్ పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘కోహ్లీ పెద్ద గుడ్డు పెట్టాడు’ అంటూ నెటిజన్స్…
Sunil Gavaskar on ఐపీఎల్ Virat Kohli Form: 2024లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్. 15 మ్యాచ్‌లలో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. పదిహేను రోజులు తిరిగేసరికి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో తేలిపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్‌కే (1, 4, 0) పరిమితమయ్యాడు. దీంతో విరాట్ ఫామ్‌పై మళ్లీ ఆందోళన నెలకొంది. యూఎస్‌ఏ పిచ్‌లపై ఆచితూచి ఆడాల్సిన సమయంలో ఒత్తిడికి గురై…
Virat Kohli Records First Golden Duck in T20Is: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన విరాట్.. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలిసారిగా…
Barmy Army slammed by India Fans for Trolling Virat Kohli: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నో వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ మ్యాచులో అభిమానులు ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముందుగా ఇంగ్లండ్ ఫాన్స్ ట్రోల్ చేయగా.. ఆపై భారత్ ఫాన్స్ గట్టిగా ఇచ్చిపడేశారు. ఇంగ్లండ్‌పై అద్భుత రికార్డు ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆ జట్టు ఫాన్స్…