భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలోనూ నిరాశ పరిచాడు. పెర్త్ వన్డేలో 8 బంతులు ఆడి డకౌట్ అయిన కోహ్లీ.. అడిలైడ్ వన్డేలో నాలుగు బంతులు ఆడి ఖాతా తెరవలేదు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. రెండు వన్డేల్లో నిరాశపరచడంతో ఫాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కింగ్ తన వన్డే కెరీర్‌లో ఇలా వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అవ్వడం ఇదే మొదటిసారి.
అవుట్ అయిన అనంతరం విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు వెళ్తూ అడిలైడ్ ఓవల్ ప్రేక్షకుల వైపు చూశాడు. ఆ సమయంలో అతడి ముఖంపై చిరునవ్వు కనిపించింది. ఆపై నిశ్శబ్దంగా తన కుడి చేతిని పైకెత్తాడు. అప్పుడు కోహ్లీ ముఖంలో ఎలాంటి కోపం లేదు, నిరాశ లేదు.. లోతైన నిశ్శబ్దం మాత్రమే కనిపించింది. మనం ఇక్కడ మరలా కలవకపోవచ్చు అని కోహ్లీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సెస్ అనంతరం వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతాడా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Also Read: Team India: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత్ ఓటమికి 3 ప్రధాన కారణాలు ఇవే!
అడిలైడ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల (టెస్టులు, వన్డేలు, టీ20లు) జాబితాను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ ఆధిక్యంలో ఉన్నారు. టాప్ 15 బ్యాట్స్‌మెన్‌లలో ఒకే ఒక్క విదేశీ ఆటగాడు ఉన్నాడు.. అది విరాట్ కోహ్లీనే. రికీ పాంటింగ్ అత్యధికంగా 2188 రన్స్ చేయగా.. కోహ్లీ 967 పరుగులు చేశాడు. అడిలైడ్‌లో 1000 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి కేవలం 25 పరుగులు మాత్రమే అవసరం. అడిలైడ్ ఓవల్‌లో వెయ్యి పరుగులు చేసిన మొదటి ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్‌గా నిలిచే అవకాశం రాగా.. వృధా చేశాడు కింగ్.