వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలైంది. అందులో కింగ్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. తన తోటి ఆటగాళ్లతో కలిసి నెట్ లో బిజీగా గడిపేస్తున్నాడు.
కోహ్లీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసుకోవడం అభిమానులకు అస్సలు నిద్రపట్టడం లేదు. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్.. అతని పేలవ ప్రదర్శనతో షాక్ అయ్యారు.
విరాట్ కోహ్లీ వందవ టెస్ట్ పై ఎన్నో అంచనాలున్నాయి. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. శుక్రవారం నుంచి మొహాలీలో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. తన 100వ టెస్టు ఆడబోతున్న విరాట్ కోహ్లీకి సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు అందించాడు. కోహ్లి యొక్క “అద్భుతమైన” ఆన్-ఫీల్డ్ అచీవ్‌మెంట్ కాకుండా, అతని నిజమైన విజయం మొత్తం తరం క్రికెటర్లను ప్రేరేపించగల సామర్థ్యం అని సచిన్ నొక్కిచెప్పారు. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేదు. ఇప్పుడు మూడు…
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుమార్తె వామికా విషయంలో గోప్యతను పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ హాఫ్ సెంచరీ చేసి సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్టేడియంలోని కెమెరాలు వామిక ముఖాన్ని బయట పెట్టాయి. విరాట్ హాఫ్ సెంచరీ చేయడంతో అతని వైపు చూపించాడు. ఆ తర్వాత కెమెరామెన్ కెమెరాను వామిక వైపు చాలాసేపు ఫోకస్ చేశాడు. దీంతో ఆ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి షేర్…
టీమ్ ఇండియా సారధిగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు శనివారం తెరపడింది. కాదు, తనకు తాను తెర దించాడు. ఆయన నాయకత్వంలో టీంఇండియా ప్రతిభతో నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయపథంలో పరుగులు తీసింది. భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన అతిరథ మహారధుడు విరాట్ కోహ్లీ. ఏ ఆటలో అయినా విజయవంతమైన ఆటగాళ్లకు తమదైన ఓ ముద్ర ఉంటుంది. జట్టు సారధికి కూడా తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆటగాడిగా, కెప్టెన్ గా భారత క్రికెట్‌పై కోహ్లీ…
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. విరాట్ కోహ్లీ మధ్య గొడవ.. దేశ క్రికెట్‌కు మంచిది కాదని సూచిస్తున్నారు సీనియర్లు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేందుకు…ఇలా గొడవ పడితే…దీని ప్రభావం ఆటగాళ్లపై పడుతుందని అంటున్నారు. దక్షిణాఫ్రికా లాంటి కీలక విదేశీ పర్యటనలకు ముందు గొడవలు జరిగితే…ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తుందన్నారు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి ఎంత గొప్పదో.. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం కూడా అంతే గొప్ప విషయమన్నారు. బహిరంగంగా పరస్పరం చెడుగా మాట్లాడుకోవడం.. మంచి…
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం తాను విరాట్‌తో తప్పకుండా మాట్లాడతానని చెప్పాడు. రెండో టెస్టులో టీమిండియా గెలవడంపై సంతృప్తిగా ఉన్నానని.. పరుగుల గురించి ఆందోళన చెందట్లేదని కోహ్లీ చెప్పాడని తెలిపాడు. ఆ ఆటిట్యూడ్ ఉంటే కోహ్లీ తప్పకుండా సెంచరీ చేస్తాడని, ఎవరూ మోటివేట్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. అయితే కోహ్లీ గత కొన్ని…
టీమిండియా కెప్టెన్, రన్ మిషిన్ విరాట్ కోహ్లీకి ఏమైంది ? వరుసగా టెస్టుల్లో ఎందుకు విఫలమవుతున్నాడు ? హాఫ్ సెంచరీ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నాడా ? కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కొలేక…బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్ అవుతున్నాడా ? విరాట్ కోహ్లీ…టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్. టెస్టులైనా, వన్డేలైనా, టీ20 మ్యాచులయినా…అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీకి సాటిరారు. అలాంటి బ్యాట్స్‌మెన్ కొంతకాలంగా బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. అర్ధసెంచరీ సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. చిన్నా పెద్ద టీమ్‌లు అన్న తేడా లేకుండా…భారీ స్కోరు చేయలేక…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కరోనా పేషెంట్స్ కు సహాయం చేయడానికి ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి అభిమానుల నుండి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజు రూ.3.6 కోట్ల విరాళాలు అందగా, ఆరు రోజుల్లో ఈ సంఖ్య 11,39,11,820 రూపాయలకు చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని ట్విట్టర్ లో విరాట్ తెలిపారు. “మా లక్ష్యాన్ని ఒక్కసారి కాదు,…