వామిక వైరల్ పిక్ పై విరుష్క రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుమార్తె వామికా విషయంలో గోప్యతను పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ హాఫ్ సెంచరీ చేసి సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్టేడియంలోని కెమెరాలు వామిక ముఖాన్ని బయట పెట్టాయి. విరాట్ హాఫ్ సెంచరీ చేయడంతో అతని వైపు చూపించాడు. ఆ తర్వాత కెమెరామెన్ కెమెరాను వామిక వైపు చాలాసేపు ఫోకస్ చేశాడు. దీంతో ఆ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు నెటిజన్లు. ఆ వెంటనే సోషల్ మీడియాలో వామిక పిక్స్ వైరల్‌గా మారాయి.
Read Also : హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో
Also Read
ఇప్పుడు అనుష్క సోషల్ మీడియాలో స్పందిస్తూ ఫోటోను మళ్లీ వైరల్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేసింది. అందులో తన కుమార్తె వైరల్ పిక్ విషయాన్ని ప్రస్తావించింది. “హలో ఫ్రెండ్స్… నిన్నటి మ్యాచ్‌లో స్టేడియం నుండి నా ఫోటో షేర్ చేయబడిందని నేను గ్రహించాను. ఈ చిత్రాలు మాకు తెలియకుండానే బయటకి వచ్చాయని అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. నా స్టాండ్, అప్పీల్ మునుపటిలాగే ఉన్నాయి. వామిక చిత్రాన్ని క్లిక్ చేయకపోయినా లేదా షేర్ చేయకపోయినా మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. దీని వెనుక ఉన్న కారణాన్ని మేము ఇప్పటికే చెప్పాము… ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. కుమార్తె ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో అనుష్క, విరాట్ ఇద్దరూ ఇప్పుడు వామికా గోప్యతపై తమ వైఖరిని గౌరవించాలని ప్రజలను కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. వామికా చిత్రాలను ప్రచురించవద్దని దంపతులు సోమవారం మీడియాను అభ్యర్థించారు.

తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!