ప్రపంచ కుబేరుడు, టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను త్వరలోనే తన అన్ని ఉద్యోగాల నుంచి తప్పుకుంటానని, ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కొనసాగుతానని, దీనిపై నెటిజన్లు ఏమనుకుంటున్నారో చెప్పాలని కోరుతూ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎలన్ మస్క్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక సతమతమవుతున్నారు. కొన్ని రోజుల క్రితం మస్క్ టెస్లాలోని తన వాటా షేర్లను అమ్మెయ్యాలని…
చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి సెల్ఫీలు ఎక్కువయ్యాయి. ఎప్పుడైనా ఒకటి రెండు ఫొటోలు తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని, ఎప్పుడూ అదే పనిగా సెల్ఫీలు దిగుతుంటే, ఏదోక సమయంలో అభాసుపాలవ్వాల్సి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. ఇలానే ఓ యువతి అందంగా ముస్తాబై బురద కాలువ గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆ యువతి అదుపుతప్పి బురదకాలువలో పడిపోయింది. Read: కరోనా అంతంపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు… ఒళ్లంతా బురద…
దేశవ్యాప్తంగా విషాదం నింపిన హెలికాప్టర్ ప్రమాదానికి పొగమంచే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడురోజుల నుంచి ఈ మార్గంలో ట్రయల్ రన్ నడుస్తోంది. సంజప్పన్ క్షత్తిరం గ్రామంలో కాలిపోతూ కుప్పకూలింది మిలటరీ హెలికాప్టర్. బుధవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాతేరీ పార్క్ లో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి ప్రాంతంలో సాధారణంగా పొగమంచు ఎక్కువగా వుంటుంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాసేపట్లో వెల్లింగ్…
ప్రపంచంలో చాలా రాజ్యాలు, రాజులు ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే చరిత్రను సృష్టించారు. అలాంటి వారిలో ఫ్రాన్స్ కు చెందిన నెపోలియన్ చక్రవర్తి ఒకరు. నెపోలియన్ 1799లో తిరుగుబాటు జరిగినపుడు వినియోగించిన ఖడ్గాన్ని వేలం వేశారు. చారిత్రాత్మక ఖడ్గం 2.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిందని వేలం నిర్వాహకులు ప్రకటించారు. ఇల్లినాయిస్‌కు చెందిన రాక్ ఐలాండ్ సంస్థ ఖడ్గాన్ని వేలం వేసింది. ఖడ్గంతో పాటు ఐదు ఆభరణాలు కలిగిన తుపాకులను కూడా ఈ వేలం వేశారు. Read:…
మరికాసేపట్లో పెళ్లి అనగా ఏదో కారణం చేత పెళ్లిళ్లు ఆగిన సంగతులు చూశాం. నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. అయితే, పెళ్లి తంతు అంతా బాగా జరుగుతున్న సమయంలో పెళ్లి మండపంలోకి మాజీ ప్రియుడు వచ్చి గలాటా చేయడం వలన పెళ్లిళ్లు జరిగిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో ఓ పెళ్లి మండపంలో వివాహం జరుగుతున్నది. పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడు దండలు మార్చుకునేందుకు సిద్దమయ్యారు. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఓ…
ఎడారి దేశం ఈజిప్ట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పిరమిడ్స్. వేల సంవత్సరాల క్రితం పిరమిడ్స్ ను నిర్మించారు. ఎందరో పిరమిడ్స్‌పై పరిశోధనలు చేశారు. అందులోని సంపదను కొల్లగొట్టారు. మమ్మీలను దొంగిలించారు. పిరమిడ్‌లు నిర్మించిన సమయానికే ఆ దేశంలో గొప్ప సంస్కృతి వెల్లివిరిసింది. కాల క్రమేణా ఆ సంస్కృతి, అప్పటి భవనాలు పుడమిగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు కొన్ని శిధిలాలు మాత్రమే అప్పటి సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. Read: విద్యాసంస్థల్లో కరోనా టెన్షన్… 72 గంటల్లో……
ఏ ఎన్నికలు జరిగినా వంద శాతం పోలింగ్ అనేది చాలా అరుదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిసార్లు వంద శాతం పోలింగ్ జరిగిన సందర్భాలు ఉండొచ్చు.. కానీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. రాజకీయ పార్టీలు ఎంత ప్రచారం చేసినా.. ఎన్నికల సంఘం ఎన్ని సూచనలు చేసినా.. పోలింగ్‌కు దూరంగా ఉండేవారు చాలా మందే.. అయితే, ఎన్నికల్లో ఓటు వేయనివారికి ఎన్నికల కమిషన్ జరిమానా విధించేందుకు సిద్ధమైందని.. ఓటు హక్కు వినియోగించుకోని వారి బ్యాంకు…
సాధారణంగా రోడ్డుపై వెళ్లే బైక్, కారు, ఇతర వాహనాలకు పంక్చర్లు అవుతుంటాయి. అలా జరిగినపుడు అవసరమైతే తోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే ఆకాశంలో ప్రయాణం చేసే విమానం టైర్‌కు పంక్చరైతే ఏంచేయాలి. రన్‌వే మీదున్న విమానం ముందుకు కదలాలి అంటే తప్పనిసరిగా టైర్లు ఉండాల్సిందే. పంక్చరైతే కనీసం కొంచెం కూడా ముందుకు కదలని పరిస్థితి వస్తుంది. దీంతో చేసేదిలేక విమానంలోని ప్రయాణికులంతా దిగి తలోచేయి వేసి ముందుకు తోశారు. Read: లైవ్: రోశయ్యకు ఘన నివాళి……
జీవితంలో పెళ్లి అన్నది ఒక మధురానుభూతి. పెళ్లిని వెరైటీగా చేసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. పెళ్లి పనుల నుంచి పెళ్లి పత్రిక వరకు వైవిధ్యం కనబరచాలని చాలా మందికి ఉంటుంది. అయితే, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లో పనిచేసే డాక్టర్ సందేశ్ తన పెళ్లి పత్రికను కూడా తన స్టాక్ మార్కెట్ భాషలో అచ్చువేయించాడు. పెళ్లి పత్రికలో వాడిన పదాలన్నీ స్టాక్ మార్కెట్లో నిత్యం వినే పదాలకు అన్వయించారు. వివాహ పత్రిక ఆహ్వానాన్ని ఐపీఓ గా పేర్కొన్నారు. …