ఎడారి దేశం ఈజిప్ట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పిరమిడ్స్. వేల సంవత్సరాల క్రితం పిరమిడ్స్ ను నిర్మించారు. ఎందరో పిరమిడ్స్‌పై పరిశోధనలు చేశారు. అందులోని సంపదను కొల్లగొట్టారు. మమ్మీలను దొంగిలించారు. పిరమిడ్‌లు నిర్మించిన సమయానికే ఆ దేశంలో గొప్ప సంస్కృతి వెల్లివిరిసింది. కాల క్రమేణా ఆ సంస్కృతి, అప్పటి భవనాలు పుడమిగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు కొన్ని శిధిలాలు మాత్రమే అప్పటి సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.
Read: విద్యాసంస్థల్లో కరోనా టెన్షన్… 72 గంటల్లో…
కాగా, ఆధునిక యుగం 21 వ శతాబ్దంలో పిరమిడ్ చుట్టూ పెద్ద పెద్ద నగరాలు వెలిశాయి. పర్యాటకంగా ఈజిప్ట్ దేశం ఆకట్టుకుంటోంది. 1875 వ సంవత్సరంలో అప్పటి చిత్రకారులు ఈజిప్ట్‌కు సంబంధించిన ఫొటోను తీశారు. ఆ ఫొటోను, 2020 వ సంవత్సరంలో తీసిన ఫోటోను పక్క పక్కనే ఉంచి ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఏమీ లేని ఆ ప్రాంతంలో ఓ పెద్ద నగరమే వెలిసింది.