Viral : మన దేశం లో ప్రతిభ గలవారికి అస్సలు కొదవే లేదు. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపే తెలివితేటలతో ముందుంటారు. అలాంటిదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో. సాధారణంగా ఉల్లిపాయలు కోస్తే కళ్లలో నీళ్లు వచ్చి చెమర్చిపోతుంది. దీన్ని నివారించేందుకు అనేక చిట్కాలు చుట్టూ తిరిగాయి కానీ.. ఓ తెలివైన మహిళ మాత్రం తానే సొంతంగా ఓ పరిష్కారాన్ని కనుగొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. Health Tips:…
Viral News : ఇప్పటి కాలంలో మనుషుల్లో మానవత్వం క్రమంగా తగ్గిపోతున్నదనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయకపోవడం, మృగాల కన్నా హీనంగా ప్రవర్తించడమూ సహజంగా మారిపోయిన సమాజంలో… కొందరు చిన్నారులు చూపించిన ఉదాత్త భావన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో, ఇద్దరు చిన్నారులు గాయపడిన ఓ మూగజీవిపై చూపించిన ప్రేమకు అందరూ ముగ్దులవుతున్నారు. చక్రాల బండిలో గాయపడిన కుక్కను కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ అమూల్యమైన…
Abhishek-Aishwarya Rai: బాలీవుడ్ లో “కజరారే” పాట పేరు వినగానే గుర్తొచ్చే జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. 2005లో విడుదలైన “బంటి ఔర్ బబ్లీ” సినిమాలో ఈ పాట అభిమానుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఆ ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్ లో అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఐకానిక్ స్టెప్స్ ను మరోసారి తిరిగితెచ్చారు బచ్చన్ దంపతులు. ముంబయిలో జరిగిన ఓ వివాహ వేడుకలో…
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటువాద ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లోని అతిపెద్ద ప్రావిన్సు, అత్యధిక ఖనిజవనరులు కలిగిన బలూచిస్తాన్ సొంతదేశం కోసం పోరాటం చేస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల బలూచిస్తాన్ని స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకుంది. తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితిని కూడా ఆశ్రయించింది. మరోవైపు, బీఎల్ఏ యోధులు పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. పాక్ ఆర్మీ కనిపిస్తే దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ హరోప్తో పాక్ సైన్యాన్ని వేటాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే, క్వెట్టా, పంజ్గుర్,…
Viral : వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అన్న మాటను మరోసారి నిజం చేసిన ఘట్టం ఇది. హర్యానాకు చెందిన ఓ తాతయ్య, తన మనవడు ఇచ్చిన ఫోర్డ్ మస్టాంగ్ కీతో కారులోకి ఎక్కి ఊహించని రీతిలో డ్రిఫ్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. సినీ స్టైల్లో స్టంట్లు చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. “తాత రాక్ – మనవడు షాక్!” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దేవ్ చహల్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో,…
నవమాసాలు మోసి కని ఆలనా పాలనా చూసిన తల్లి తాను చనిపోతే తలకొరివి పెడతాడు అనుకుంటుంది.. కానీ.. ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు. తనకు ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు. ఈ ఘటన తాజాగా జైపూర్లోని విరాట్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లా, గురువారం తెల్లవారుజాము. నాదర్, ట్రాల్ ప్రాంతం. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ ద్వారా ముగ్గురు ఉగ్రవాదుల కదలికలను ఓ ఇంట్లో గమనించారు.
టాలీవుడ్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కార్ తో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అడ్డుకుని ఇదేంటని నిలదీయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. అందరికీ ఆదర్శంగా నిలిచే నటులే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజలు వీరిని చూసి ఏం నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.
Viral Video: అప్పుడప్పుడు క్రికెట్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా బంగ్లాదేశ్ A , న్యూజిలాండ్ A జట్ల మధ్య జరిగిన వన్డేలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. మే 11 (ఆదివారం) జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ హుస్సేన్ చేసిన హాస్యాస్పదమైన పొరపాటు న్యూజిలాండ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులను ఇచ్చింది. ఈ సంఘటన న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఐదవ ఓవర్లో జరిగింది. ఎడాబోట్ హుస్సేన్ వేసిన…
భారత సైన్యం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ తీవ్రంగా కృంగిపోయింది. రోజురోజుకూ ఓటమి వైపు పయనిస్తున్న పాకిస్థాన్ సైన్యం.. ఇప్పుడు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ సైన్యం కొత్త అబద్ధాలను పుట్టిస్తోంది. అయితే.. శనివారం మరో కొత్త దుష్ర్పాచారం చేసింది. ఢిల్లీ విమానాశ్రయంపై క్షిపణితో విజయవంతంగా దాడి చేశామని, ఈ దాడిలో విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైందని పాకిస్థాన్ పేర్కొంది.