Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Sethupathi International Emmy Awards: తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరో అరుదైన ఘనత సాధించనున్నారు. నవంబర్ 23న న్యూయార్క్‌లో జరగనున్న 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో అవార్డును అందించే తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి చరిత్ర సృష్టించబోతున్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సినీ ప్రతిభకు మరో గుర్తింపు లభించనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 2016లో జరిగిన 68వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్ స్టన్‌తో కలిసి అవార్డును అందించారు. అయితే ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్న తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి నిలవనున్నారు. ఈ ఘనత వెనుక ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు, నిర్మాత కవితా గుప్తా పాత్ర కూడా ఉంది. అంతర్జాతీయ వేదికలపై భారతీయ ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024లో జరిగిన ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకకు హాస్యనటుడు వీర్ దాస్‌ను హోస్ట్‌గా తీసుకురావడంలోనూ కవితా గుప్తా పాత్ర ఉంది. 2023లో తన కామెడీ స్పెషల్ ‘వీర్ దాస్: ల్యాండింగ్’కు ఆయన ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు అందుకున్నారు. అప్పుడు వీర్ దాస్ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఇప్పుడు విజయ్ సేతుపతి ప్రజెంటర్‌గా కనిపించనున్నారు.
Also Read
విజయ్ సేతుపతి ఇటీవల వచ్చిన ‘బత్తా’ చిత్రంలో నటించారు. 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ కథలో బత్తా అనే భయంకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో విజయ్ నటించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘ఇంజి వెల్లం’లో విజయ్ నటించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా కనిపించనున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు విజయ్ నటించిన థ్రిల్లర్ ‘మహారాజా’ హాలీవుడ్లో రీమేక్ కానుంది. చైనాలో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న తర్వాత హాలీవుడ్‌కు చెందిన ఓ ఏజెన్సీ రీమేక్ హక్కుల కోసం నిర్మాతలను సంప్రదించినట్లు నిర్మాత సుధన్ సుందరం వెల్లడించారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
ట్రెండింగ్
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!