Singer Zubeen Garg: మరణానికి ముందు సింగర్ జుబీన్ గార్గ్ చివరి క్షణాలు.. వీడియో వైరల్
- మరణానికి ముందు సింగర్ జుబీన్ గార్గ్ చివరి క్షణాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణం ఆయన అభిమానులను తీవ్ర శోకంలో ముంచేసింది. తన గానంతో అస్సాం ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటిది ఒక్కసారిగా హఠాన్మరణం చెందడం ఆయనను ప్రేమించేవారు.. అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గార్గ్ మరణాన్ని తట్టుకోలేక మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక గార్గ్ చనిపోకముందు ఏం జరిగిందో.. ఆయన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read
జుబీన్ గార్గ్ సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం బోటుపై షికారు చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. బోటులోంచి లైఫ్ జాకెట్ ధరించి నీళ్లకు దూకి ఈత కొట్టడం ప్రారంభించారు. కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. కొద్దిసేపటికే ఆయన స్పృహ కోల్పోయారు. కొద్దిసేపు నీళ్లలోనే శవంలా ఉండిపోయారు. అనంతరం సహచరులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మరణ వార్త తెలియగానే అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. జుబీన్ గార్గ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే ప్రధాని మోడీ కూడా జుబీన్ గార్గ్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

ఇక జుబీన్ గార్గ్ భౌతికకాయానికి శనివారం పోస్ట్‌మార్టం పూర్తైంది. ఆదివారం సాయంత్రానికి భౌతికకాయంం అస్సాంకు రానున్నట్లు తెలుస్తోంది. భారత హైకమిషనర్‌తో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంతనాలు జరుపుతున్నారు. ఆదివారం సాయంత్రానికి భౌతికకాయం గౌహతి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల సందర్శనార్థం గౌహతిలోని సారుసజై స్టేడియంలో ఉంచుతామని చెప్పారు. అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయనేది అస్సాం ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. గార్గ్ రాష్ట్ర ప్రజలకు చెందిన వాడు.. వాళ్లే నిర్ణయింంచుకుంటారన్నారు. ప్రజలను సంప్రదించకుండా తామేమీ చేయమని తేల్చిచెప్పారు.

బోటులో మొత్తం 18 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో అస్సామీకి చెందిన 11 మంది, గాయక బృందంలోని నలుగురు సభ్యులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇంకొకరు బోటు బుక్ చేసిన వ్యక్తి ఉన్నాడు. అయితే అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ గార్గ్ మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. గార్గ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.

గార్గ్ సాంస్కృతిక చిహ్నం అని.. అస్సాం స్వరం మూగబోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంతాపం వ్యక్తం చేశారు. ఇక గార్గ్ ప్రతిభ నిజంగా సాటిలేనిది అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. తన సోదరుడిని కోల్పోయానంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గార్గ్ మరణం శూన్యతను మిగిల్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?