సాధారణంగా పామును చూడగానే ఏమనిపిస్తుంది. చాలా మంది సల్ల చెమటలు పడతాయి.. కొందరు అక్కడి నుంచి పరార్.. కొంత మంది దైర్యం చేసి వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. వర్షాకాలంలో ఇళ్లలోకి వచ్చి పాములు, తేళ్లు దాక్కుంటాయి. ఇంటి ముందు బైక్‌లు, కార్లలో కూడా పాములు దాక్కుంటాయి. దీంతో పాము కాటేయడంతో పలువురు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ భారీ కొండ చిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ బారంబాంకీలోని సత్నమ్ పుర్వాలో ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. డ్రైవర్ కారు నడుపుతున్న సమయంలో బానెట్ కింద ఏదో అలజడి మొదలైందట. దీంతో కారు ఆపి బానెట్ ఓపెన్ చేయడంతో అతడికి భారీ కొండ చిలువ కనిపించింది. దీంతో అతడు అక్కడి నుంచి లగెత్తరో అజామ్ అనుకుంటూ పరిగెత్తాడు డ్రైవర్.
అనంతరం కారు దగ్గరకు చేరుకున్న కొందరు స్థానికులు వీడియో తీయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కొండ చిలువను జాగ్రత్తగా బంధించి తీసుకెళ్లారు. దీంతో నెట్టిజన్లు కారులో షికారు పోదామా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

यूपी के बाराबंकी में भाजपा नेता नागेंद्र प्रताप सिंह की कार के इंजन में 7 फीट लंबा अजगर छिपा मिला।

वन विभाग ने सुरक्षित रेस्क्यू किया। #UttarPradesh #Barabanki pic.twitter.com/Vz9l6SNCrQ
— Vinay Saxena (@vinaysaxenaj) September 22, 2025