Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anam Ramanarayana Reddy: స్థానిక సంస్థల వేళ నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రౌడీయిజానికి పాల్పడుతున్నారని, రౌడీ మూకలను వెంటేసుకుని అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్ జగన్ చొక్కా మడత పెట్టాలని ఆదేశిస్తే.. విక్రమ్ రెడ్డి తన చొక్కా మడత పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆనం ఎద్దేవా చేశారు. అనంతసాగరం మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి పోలీసులు సహకరించారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రౌడీ మూకలను వెంటేసుకుని తిరుగుతూ అరాచకాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడుతున్నారని, అంతు చూస్తామంటూ పోలీసులను బెదిరిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో బూత్‌లను మాజీ ఎమ్మెల్యేకు అప్పగించి తాను చెక్క భజన చేసుకుంటూ కూర్చోవాలా? అంటూ మంత్రి ఆనం ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు, అరాచకాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గతంలో మహామహులను సైతం తరిమి తరిమి కొట్టిన చరిత్ర తనదని వ్యాఖ్యానించారు. ఇక, మేకపాటి కుటుంబంపైనా మంత్రి ఆనం తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లాలో నాటు బాంబులు తీసుకొచ్చిన సంస్కృతి మేకపాటి కుటుంబానిదేనని విమర్శించారు. కుటుంబ సభ్యుల ఆస్తులను దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న చరిత్ర విక్రమ్ రెడ్డిదని ఆరోపించారు. కేరళలో ఆయనపై క్రిమినల్ కేసులు లేవా? అంటూ ప్రశ్నించారు. అయితే, తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఇబ్బందులు సృష్టించాలని చూస్తే సహించబోనని ఆనం హెచ్చరించారు. “నా జోలికి వస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆనం.. అయితే, నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
తాజావార్తలు
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
-
Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
-
E20 Petrol New Controversy: E20 పెట్రోల్‌పై మరో వివాదం.. ఏకంగా 31.2 శాతం ఇథనాల్! ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
ట్రెండింగ్
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!