దేశంలోని మెట్రో సిటీలైన ఢిల్లీ, కోల్కత్తా, ముంబయి, బెంగళూరూ, హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్లు సర్యసాధారణం. అయితే సాధారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏమీ చేస్తారు.. ఏముంది.. కొద్దిసేపు వెయిట్ చేస్తాం లేదా.. పాటలు వింటూ ఉంటాం.. ఇంకా ఓపిక లేకపోతే ట్రాఫిక్ జామ్పై ప్రభుత్వాలను తిట్టుకుంటాం.
Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక వీడియోలు వైరల్గా మారుతున్నాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆనందం కోసం డ్యాన్స్ చేయడం చిన్నపిల్లలు మాత్రమే చేసే పని అనుకుంటే పొరపాటే.. ఆనందంలో చిందులు వేయడానికి వయసుకు సంబంధం లేదు.
అసలే పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. బండికి పెట్రోల్ కొట్టించుకోలేక చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. కొంతమంది పెట్రోల్ బైకులను పక్కనపెట్టి బ్యాటరీ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో పెట్రోల్ ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా వదులుతారా. రండి బాబు రండి అని చెప్పగానే… వందలాది వాహనాలు క్యూ కట్టాయి.
ఎవరికైన ఎత్తై పర్వతాలు, బిల్డింగ్ లు చూస్తే భయపడతారు. మరికొందరు ఎంజాయ్ చేస్తారు. అయితే.. ప్రస్తుతం ఓ యువతి బైక్ నడుపుతున్న షాకింగ్ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ మహిళ మాత్రం బైక్ పై నియంత్రణ కోల్పోకుండా ధైర్యంగా ఎత్తైన కొండల మధ్య డ్రైవింగ్ చేస్తూ.. అందరితో శభాష్ అనిపించుకుంటుంది.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గానూ 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది.
హంగేరిలోని బుదాపేస్ట్ జూలో ఈ సంఘటన జరిగింది. ఓ కొలను ఒడ్డు వద్ద కాకి ఒకటి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. అయితే అదే సమయంలో అక్కడికి ఓ ఎలుగుబంటి వచ్చింది. నీటిలో పడిపోయిన కాకి అరుపులు గమనించిన ఎలుగుబంటి ఆ కాకి వద్దకు వెళ్లి.. నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటి చటుక్కున పట్టుకుని ఒడ్డున పడేసి సేవ్ చేసింది. తన నోటి సాయంతో కాకి రెక్కలను పట్టుకుని బయటకు ఆ ఎలుగుబంటి తీసింది.
Viral Video: కొన్నిసార్లు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కొట్టుకోవడం చూశాం. ఇండియాలో ఇటువంటి సంఘటనలు చాలా వరకు జరిగాయి. అయితే ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఒకరినొకరు తన్నుకోవడం చాలా వరకు అరుదు. అదికూడా అమెరికా లాంది దేశాల్లో. సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉంటుంది.
ఢిల్లీ మెట్రో రైల్ లో మందుబాబులు హల్చల్ చేశారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మందుబాబులు వీరంగానికి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.. దీంతో వారు తమ సెల్ఫోన్ల ద్వారా రికార్డ్ చేశారు. మత్తులో ప్రయాణిస్తున్న మందుబాబుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. మరోసారు ఢిల్లీ మెట్రో వార్తలు వైరల్గా మారాయి.
ఒక చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంది. చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా సందర్శకులు తమ కెమెరాల్లో బంధించడానికి ట్రై చేశారు.. ఈ క్రమంలోనే ఊహించని ఘటన జరిగింది. సందర్శకులు కెమెరాలతో చిరుతను షూట్ చేస్తున్నారు. ఆ చిరుతపులి వేగంగా నడుచుకుంటూ వచ్చింది.