Samajwadi MLA Thrashes BJP Leader's Husband: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష ఎమ్మెల్యే అధికార బీజేపీ పార్టీకి చెందిన నాయకురాలి భర్తను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్పై సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) శాసనసభ్యుడు రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేశారు.
Viral : మనం అనుకోకుండానే కొన్ని సార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వాటిలో ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం. ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి యువతి జారిపోయి రోడ్డు మీద పడి చనిపోయింది.
Viral Video: ఫుల్గా మందేసిన తర్వాత కొందరు కదలకుండా పడుకుంటారు.. మరికొందరు నా అంతే తోపే లేడు అంటూ చిందులు వేస్తాడు.. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.. ఇలా చాలా మంది ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.. తాజాగా, ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.. ఆ వీడియోలో ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న…
ఓ కాలేజీలో ఫేర్ వెల్ లో భాగంగా స్టేజ్ పై కనికా గోపాల్ అనే యువతి డ్యాన్స్ చేసింది. పాటకు అనుగుణంగా స్టెప్పులతో, కిల్లింగ్ లుక్స్ తో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో దుమ్ము రేపింది. తగ్గేదేలే అన్నట్లుగా ఆమె డ్యాన్స్ చేసింది. ఇంకేముందు.. కనికా గోపాల్ డ్యాన్స్ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది.
బీహార్ లోని రోహ్తాస్ జిల్లా మోరాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ పారే మురికి కాల్వలో కరెన్సీ నోట్లు ప్రత్యేక్షమయ్యాయి. నోట్ల కట్టలు తీసుకునేందుకు ప్రజలు పోటీలుపడ్డారు. దొరికిన వారు దొరికినంత డబ్బుల కట్టలను తీసుకెళ్లారు. కరెన్సీ నోట్లలో రూ.2వేలు, రూ.500, రూ.100, 10 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మంచి ప్రదర్శనప్పటికీ తన ప్రవర్తనతో విలన్ రోల్ కూడా పోషిస్తున్నాడు.లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో కోహ్లి, గంభీర్ గొడవకు మూలకారకుడు సిరాజే అన్న సంగతి అందరికి తెలుసు.. ఆ గొడవ సద్దుమణుగకముందే సిరాజ్ మరోసారి ఆవేశానికి లోనయ్యాడు.
తమిళనాడులోని కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో 10 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వరద నీటిలో ఓ అరుదైన భారీ శ్వేత నాగు కొట్టుకొచ్చింది. దానిని చూసి భయాందోళనకు గురైన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.
తాజాగా ఇదే విషయాన్ని ఓ చిట్టి ఎలుక నిరూపించింది. సాధారణంగానే పిల్లి, ఎలుక మధ్య జాతి వైరుధ్యం ఉంటుంది. ఎలుక కనిపిస్తే చాలు.. గుటుక్కున మింగేయాలని పిల్లి చూస్తుంది.
ఈ మధ్య రీల్స్ చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన రీల్ వీడియో నెట్టింటా వైరలవుతోంది. ఓ ట్రెండింగ్ సాంగ్ కు ఆ యువతులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Manhole : ప్రస్తుతం ఏ సీజనో కూడా జనాలకు అర్థం కావడంలేదు. మే నెల మధ్యకు వస్తుంది.. ఈ టైంలో భానుడు భగభగామండాల్సింది పోయి.. వరుణుడు కనికరం లేకుండా జోరుగా వాన కురిపిస్తున్నాడు. చెరువులు ఎండిపోవాల్సిన టైంలో నిండి అలుగులు పోస్తున్నాయి.