ప్రత్యేక, హిందూ, విదేశీ వివాహ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలను గుర్తించాలని దాఖలైన పిటిషన్లపై విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. అయితే దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రం స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సూచనలను స్వీకరించడానికి, సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం తరపు న్యాయవాదికి సమయం ఇచ్చింది. ఈ అంశాన్ని ఫిబ్రవరి 3న తదుపరి విచారణకు వాయిదా వేసింది.…
మనం ఏదైనా సాధించాలంటే.. దానికోసమే శ్రమించాలి.. దానిలో భాగంగా ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. వాటిని పట్టించుకోకూడదు. ఎందుకంటే కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవడంలో తప్పు లేదు. ఇదే విషయాన్ని తన జీవితంలో చేసి చూపించింది రొమేనియాకు చెందిన సిమోనా హెలెప్. ఈమెకు చిన్నప్పటినుంచి టెన్నిస్ ప్లేయర్ కావాలని కోరిక.. అందుకోసం ఎంతో శ్రమించింది. అనుకునంట్లుగానే అన్ని పోటీలలో తానే గెలిచింది. కానీ, కీలక మ్యాచుల్లో మాత్రం ఆమెకు ఓటమి తప్పలేదు. అయితే ఆ ఓటమికి కారణం తన…
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీఎస్ఆర్టీసీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు సజ్జనార్ వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడం… ఆర్టీసీ బస్సులో ప్రయాణించి స్వయంగా సమస్యలు తెలుసుకోవడం… ఇలా ఒకట్రెండు కాదు.. ఎన్నెన్నో వినూత్న చర్యలను సజ్జనార్ చేపడుతున్నారు. గతంలో పోలీస్ కమిషనర్‌గా తన మార్క్ చూపించిన సజ్జనార్.. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగానూ తన మార్క్ చూపిస్తుండటం విశేషం. Read Also: రికార్డుస్థాయికి…
సాధారణంగా రోడ్డు పక్కన ఉన్న హోటల్లో భోజనాలు, టిఫిన్లు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు.. వారు ఎలా తయారు చేస్తారు.. ఏం కలుపుతారు.. అని ఎవరు చూడరు. ఇక ఒక్కోసారి సాంబార్ లో బొద్దింకలు పడ్డాయి, ఈగలు పడుతుంటాయి అని వింటూనే ఉంటాం.. అయితే ఎప్పుడైనా ఇడ్లీలో కప్పు కళేబరం ఉండడం చూశారా ..? తాజాగా తంజావూరు జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కుంభకోణం ప్రభుత్వాస్పత్రి రోడ్డులో ఒక క్యాంటిన్ ఉంది.. ఆ…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తకాదు.. నిత్యం ఆమె వివాదాలతోనే సహజీవనం చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న ముద్దుగుమ్మ పెళ్లిపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ ప్రేమికుడిని పరిచయం చేస్తానని చెప్పింది. దీంతో ఫైర్ బ్రాండ్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని అభిమానులు తెగ సంతోషించారు. అయితే ఆ ఆనందం మూడునాళ్ళ ముచ్చటే అన్నట్లు ఉంది. తాజాగా కంగా ఇన్స్టాగ్రామ్…
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మరపురాని అనుభూతి. పెళ్లి లాంటి క్షణాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. అందుకే కొందరు ఆ క్షణాలను గుర్తుండిపోయేలా మలుచుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి కూడా తన పెళ్లిని గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని భావించాడు. దీంతో పాటు సామాజికంగానూ మంచి ఆలోచన చేశాడు. వివరాల్లోకి వెళ్తే… హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ సంఘం వ్యవస్థాపక సభ్యుడు దినేష్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. దీంతో పెద్దలు ఘనంగా పెళ్లి చేయాలని…
తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటేనే భయం భయంగా వుంది. బయటకు రాలేక, జీవనం గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. భారీ వర్షాల కారణంగా చివరి మజిలీకి తిప్పలు తప్పడంలేదు. చెన్నై లో చనిపోయిన వ్యక్తిని ట్రాక్టరు ద్వారా తీసుకెళుతున్నారు కుటుంబ సభ్యులు. సౌత్ చెన్నైలో చోటు చేసుకున్న ఘటన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. భారీ వర్షాల కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో మరణించిన…
ఓ యువతిని మోసం చేసిన ఉగాండా వ్యక్తిని పోలీసులు సినీఫక్కీలో అరెస్టు చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన ఓ యువతికి ఉగాండాకు చెందిన “నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్” అనే వ్యక్తి ఫోన్ చేసి ఆన్లైన్ లాటరీలో రూ2.5 కోట్ల వచ్చాయని నమ్మించాడు. ఈ నేపథ్యంలో లాటరీ డబ్బులు రావాలంటే ట్యాక్స్‌లు కట్టాలంటూ సదరు యువతి నుంచి మొదట రూ.3.5 వేలు, తర్వాత రూ.12.5…
సాధారణంగా భర్తలు, భార్యలను కొట్టినప్పుడో, తిట్టినప్పుడో చుట్టుపక్కల వారు చాలా మాటలు అనడం చాలాసార్లు వినే ఉంటాం.. భార్యలను కొట్టడం భర్త జన్మహక్కు అని కొందరు.. వాడి పెళ్ళాం.. వాడి ఇష్టం.. కొట్టుకుంటాడో.. కోసుకుంటాడో మనకెందుకు అని ఇంకొందరు.. భార్యభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయితే అంతే సంగతులు మనకెందుకు అని మరికొందరు మాటలు చెప్తూ ఉంటారు. అస్సలు భార్యాభర్తల మధ్య ఆ గొడవలకు కారణం ఏంటి అనేది వారికి మాత్రమే తెలుస్తోంది. అందుకే జాతీయ…
అతడో గైనకాలజిస్ట్.. మహిళలకు వచ్చే చెప్పుకోలేని సమస్యలను తీర్చే ఓ డాక్టర్.. గర్భంతో ఉన్నవారు, పర్సనల్ ప్రాబ్లెమ్ ఉన్నవారు అతడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. అదే ఆ డాక్టర్ కి అలుసుగా మారింది. అతడిలోని కామాంధుడిని రెచ్చగొట్టింది. వచ్చిన మహిళలకు వైద్యం చేయకుండా వారి ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ డాక్టర్.. చివరకు ఒక మహిళ దైర్యం చేసి డాక్టర్ కామ క్రీడల గుట్టురట్టు చేయడంతో డాక్టర్…