వ్యాపార రంగంలో ఎదగాలంటే కొన్ని స్ట్రాటజీలు ఫాలో కావాల్సిందే. అవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొంతమంది ఆఫర్లు ఎక్కువ ఇస్తారు.. ఇంకొంతమంది ఒకటి కొంటె ఒకటి ఫ్రీ అంటారు.. ఇక ఫుడ్ బిజినెస్ లో అయితే నాణ్యత, రుచి అనేది ముఖ్యం. ఒక రెస్టారెంట్ కి రావాలంటే ప్రతిఒక్కరు చూసేది రుచి.. రుచి బావుంటే ఎక్కడినుంచి అయినా కస్టమర్లు వస్తారు. అయితే ఇక్కడ చూపించే ఒక అమ్మాయి మాత్రం నా వ్యాపార స్ట్రాటజీ నా డ్రెస్ అంటోంది.. ఆ డ్రెస్ వలనే అమ్మడు పోలీసులకు టార్గెట్ గా మారింది. అస్సలు ఈ అమ్మడు డ్రెస్ కదా ఏంటో తెలుసుకుందాం.
థాయ్‌లాండ్ లో నివసించే 23 ఏళ్ల నర్సింగ్ విద్యార్థి ఆలివ్ అరణ్య అపిస్సో పాన్ కేక్ షాప్ నిర్వహిస్తోంది.ఒకపక్క చదువుకుంటూనే.. మరోపక్క షాప్ ని రన్ చేస్తోంది. అయితే మొదట్లో లాభాలు వచ్చినా పోనుపోను అమ్మడి షాప్ కి కస్టమర్లు రావడం మానేశారు. దీంతో ఏదో విధంగా తన షాప్ ని ముందుకు తీసుకెళ్లాలనుకొంది. వెంటనే తనకో స్పెషల్ యూనిఫార్మ్ ని కుట్టించేసుకొని ధరించడం మొదలుపెట్టింది. ఇంకేముందు ఆ డ్రెస్ వేసుకున్నప్పటినుంచి ఆమె షాప్ కి కస్టమర్లు ఎగబడ్డారు. అంతగా ఆమె డ్రస్ లో ఏముంది అనేగా డౌట్.. అది ఒక కట్-టాప్ టీ షర్ట్.. ముందు భాగంలో కేవలం ఎద భాగాలను కలపడానికి ఒక తాడు తప్ప మిగతా అంతా కట్ చేసి ఉన్న టీ షర్ట్.. లోపల ఎటువంటి బ్రా లేకుండా అమ్మడు దాన్ని ధరించడంతో ఆమె ముందరి భాగం అంతా నగ్నంగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఆమె అందాలను చూడడానికైనా షాప్ కి ఎగబడుతున్నారట కస్టమర్లు.
ఇకపోతే ఈమె డ్రెస్సింగ్ పై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె స్టాల్ వద్దకు చేరుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఇది తన వ్యాపార స్ట్రాటజీ అని, ఇలా చేశాకా తన వ్యాపారం నాలుగురెట్లు పెరిగినట్లు ఆమె వివరించింది. అయినా ఎదుటువారికి ఇబ్బంది కలిగించే ఏ పని చేయకూడదని, ఇకముందు ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదని పోలీసులు ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. మరి ఈసారి ఎలాంటి కొత్త స్ట్రాటజీతో ఈ అమ్మడు రెడీ అవుతుందో చూడాలంటున్నారు ఆమె ఫ్యాన్స్..