ప్రపంచంలో ఏ అమ్మాయైనా తాను అందంగా ఉండాలని కోరుకొంటుంది. దానికోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది. క్రీములని, అవని, ఇవని వాడుతూనే ఉంటారు.. ఇంకొందరు న్యాచురల్ గా అందంగా మారడానికి ముల్తాన్ మట్టి, పసుపు, మంచి నీరు ఎక్కువగా తాగడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికి తెలిసినవే.. అయితే దక్షిణ కొరియాలోని అమ్మాయిలు మాత్రం తమ అందాన్ని పెంచుకోవడానికి ఒక థెరపీని ఫాలో అవుతారంట.. అందుకే తాము అంత అందంగా ఉంటామని చెప్పుకొస్తున్నారు..
దక్షిణ కొరియాలో అమ్మాయిలు ఎక్కువగా స్లాప్ థెరపీని వాడతుంటారట.. అంటే రోజు వారు 50 చెంపదెబ్బలు కొట్టించుకుంటారు. ఇదేదో ఈ మధ్య వచ్చింది కాదు. వంద ఏళ్లుగా వారు ఆచరిస్తున్నారు. ఇలా చేస్తే ముఖం అందంగా మారుతుందట. చెంప దెబ్బ కొట్టడమంటే ఏదో చెంప మీద వాతలు తేలేలా కొట్టడం కాదు.. అలాగని మరి సుతిమెత్తగా కొట్టడం కాదు. రెండు చెంపల మీద ఒక మోస్తరు బలంతో కొడతారు. దానివలన ముఖం అందంగా, కాంతివంతంగా మారుతోందని అక్కడి అమ్మాయిలు భావిస్తారట. మొదట్లో దక్షిణ కొరియాలో మొదలైన ఈ పద్ధతి ఫలితాలు మంచిగా వస్తుండడంతో మరికొన్ని దేశాల్లో అమలు చేస్తున్నారట.. చెంపదెబ్బ కొడితే ముఖం ఎందుకు మారుతోంది అంటే .. ముఖంపై బలంగా కొడితే .. ఆ దెబ్బ నొప్పికి శరీరంలోని అన్ని భాగాలలో రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం సున్నితంగా మారుతుంది. వయసు పెరుగుతున్నా చర్మంపై ముడతలు రావట.. ఇక ఈ స్లాప్ థెరపీని మహిళలే కాదు పురుషులు కూడా పాటిస్తారంట అందుకే దక్షిణ కొరియా లో ఎక్కువమంది ముఖాలు ఎర్రగా, స్మూత్ గా కనిపిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వారిలా అందగత్తెల మారాలంటే దైర్యం చేసి ఈ స్లాప్ థెరపీని ఫాలో అయిపోండి..