Rising Political Violence Among U.S. Youth: అమెరికన్ యువతలో కోపం పెరుగుతుందా? ఆ దేశంలో రాజకీయ హత్యలు పెరుగుతన్నాయా? ప్రస్తుతం ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి, గత వారం డొనాల్డ్ ట్రంప్‌కు దగ్గరగా ఉన్న మితవాద నాయకుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు. హంతకుడు టైలర్ రాబిన్సన్ 22 ఏళ్ల యువకుడు. రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ మిత్రుడైన చార్లీ కిర్క్ వ్యవహార శైలి అతడికి నచ్చలేదు. అందుకే హత్య…
Bangladesh : బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా రాజధాని ఢాకా సహా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ ఆందోళలకు కారణం అవుతోంది. ముఖ్యంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో యువత ఆందోళన చేస్తోంది. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువకులు అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేఖిస్తున్నారు. ఆర్మీలో చేరడం మా ఆశ అని కేవలం నాలుగేళ్లకే సర్వీస్ పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ లో ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ పేరుతో ఆందోళనలు చేస్తున్నారు ఆర్మీ ఆశావహులు. నిన్నటి నుంచి…
కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది.. మొన్నటివరకూ హిజాబ్ వ్యవహారం హీట్ పుట్టించగా…. ఇప్పుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కలకలం రేపుతోంది.. దీంతో శివమొగ్గ ఉద్రిక్తంగా మారింది. ఈ హత్య రాజకీయంగాను పెను సంచలనం సృష్టించింది. హత్యవెనక శివకుమార్ ఉన్నారని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించగా.. దీని వెనక ఉన్నవారిని ఉరితీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా హత్య జరిగిన శివమొగ్గ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి చేజారకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే…