Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరింగ్ పునియా చేరారు. హర్యానాలో వచ్చే నెల తొలివారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీరి చేరిక కాంగ్రెస్‌కి మరింత జోష్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌లో చేరికపై వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం మనకు అనుకూలంగా లేని సమయంలోనే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో తెలుస్తుందని అన్నారు.
‘‘ నా కుస్తీ కెరీర్‌లో నన్ను ఆదరించినందుకు దేశ ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మరియు వారి అంచనాలను అందుకుంటానని ఆశిస్తున్నాను. నేను కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వారు చెప్పినట్లు, సమయం చెడుగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఎవరు ఉంటారో తెలుసుకోవచ్చు. మనల్ని రోడ్లపైకి ఈడ్చుకెళ్లినప్పుడు బీజేపీ తప్ప మిగతా పార్టీలు మాతో పాటు నిలబడి మా బాధను, కన్నీళ్లను అర్థం చేసుకున్నాయి’’ అని ఆమె అన్నారు.
‘‘మహిళలపై దుష్ప్రవర్తనకు, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడే పార్టీతో జతకట్టడం నాకు చాలా గర్వంగా ఉంది.. మనం కుస్తీలో పనిచేసిన అదే తీవ్రతతో దేశ ప్రజల కోసం పని చేస్తామని హామీ ఇస్తున్నాను. నేను కోరుకున్నట్లయితే, నేను జంతర్ మంతర్ వద్ద (నిరసనల సమయంలో) కుస్తీని విడిచిపెట్టి ఉండేవాడిని, కానీ నా దేశ ప్రజలకు సేవ చేయడానికి నేను ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నాను ’’ అని అన్నారు.
Read Also: Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో గొడవ.. స్నేహితుడి దారుణ హత్య
రెజ్లర్లకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వచ్చిన లేఖలపై బీజేపీ ఎంపీలు పట్టించుకోలేదని, ఆ సమయంలో అడగకుండా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని బజరంగ్ పునియా చెప్పారు. ‘‘దేశంలోని ఆడబిడ్డలకు మద్దతుగా గళం విప్పినందుకు మూల్యం చెల్లిస్తున్నాం.. దేశ ప్రజల కోసం పని చేస్తూనే కాంగ్రెస్ పార్టీతో పాటు భారతదేశాన్ని బలోపేతం చేస్తాం. వినేష్ ఫోగట్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో అందరూ సంతోషించారు. కానీ ఆమె అనర్హత వేటు పడినప్పుడు కొంతమంది సంబరాలు చేసుకున్నారు’’అని అతను అన్నారు.
వినేష్ ఫోగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. పునియా బద్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ చేరికకు ముందు వినేష్ ఫోగట్ వ్యక్తిగత కారణాలు చూపుతూ ఉత్తర రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే రైతులు ఉద్యమానికి వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు.