వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి నరసింహ కాటన్ మిల్లులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు చేయకుండా కాటన్ మిల్ యాజమాన్యం నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. పత్తి జిన్నింగ్ మిల్‌లో టెక్నికల్ సాంకేతిక లోపం రావడంతో పాటు తేమ శాతం ఎక్కువగా ఉండడంతో సీసీఐ నిబంధనల మేరకు పత్తి కొనుగోలు నిలిపివేసినట్లు పత్తి రైతులకు కాటన్ మిల్లు యాజమాన్యం తెలిపింది.
Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. లగచర్ల దాడి కేసులో ఏ-1గా ఉన్న నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.