Tdp Vs Ysrcp: టెన్త్ ఫలితాలపై వైసీపీ-టీడీపీ ట్విట్టర్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల పై వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ట్విట్టర్ లో లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణం పప్పు నాయుడూ. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదే.
దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావు. చదువు’కొన్న’వాడివి. నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడటం ఏమిటి? అంటూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయి.
అంతకుముందు ఫలితాల అనంతరం లోకేష్ ప్రభుత్వం పై మండిపడ్డారు. పదో తరగతి ఫలితాలలో కుట్ర జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టెన్త్‌లో ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితో పాటు ఇంటర్, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే ఎక్కువ మందిని ఫెయిల్ చేశారని మండిపడ్డారు. అయితే ఇది టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదని.. సర్కారు ఫెయిల్యూర్ అంటూ లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసుల కారణంగా అభాసుపాలైందని ఎద్దేవా చేశారు.
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
టెన్త్ రిజల్ట్స్ వాయిదా, దిగజారిన ఫలితాలన్నీ సర్కారు కుతంత్రమే అని ఫైరయ్యారు.20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు లోకేష్ గుర్తుచేశారు. టెన్త్‌లో దారుణ ఫలితాలు ప్రభుత్వం పాపమేనన్నారు. పదో తరగతి కష్టపడి చదివి పాసై ఉంటే వైఎస్ జగన్‌కు విద్యార్థుల కష్టాలు తెలిసేవని లోకేష్ కౌంటర్లు వేశారు. కరెంట్ కోతలు, పరీక్షా సమయం కుదింపు, పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ తక్కువ ఉత్తీర్ణతకు కారణం అన్నారు లోకేష్. దీనిపై విజయసాయి స్పందించారు.
కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి పిల్లలు ఫెయిలైతే చర్యలు తీసుకుంటామని బెదిరించిందెవరు? కిందిస్థాయి నుంచి పైవరకు పాస్ పర్సెంటేజిని పెంచడానికి ఏం చేశారో తెలియదా. మీ అండదండలున్న కార్పోరేట్ సంస్థల్లో చదివే పిల్లలు ఆలిండియా ర్యాంకర్లాయె. ఇప్పుడా ర్యాంకులు తగ్గాయని ఏడుపా బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 7, 2022
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!