కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ ప్లే చేసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విక్రాంత్ రోణ’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాన్ ఇండియా మూవీ జూలై 28న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా ఇటీవల సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర బృందం వ్యక్తిగతంగానూ అభిమానులను కలిసి, థియేటర్ లో త్రీ డీ ట్రైలర్ ను ఆవిష్కరించే పని పెట్టుకుంది. అందులో భాగంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన…
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో భారీతనం ఎంతుంటుందో అందరికీ తెలుసు. నటీనటులు సైతం ప్రముఖులే ఉంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా ఆయన హేమాహేమీల్ని రంగంలోకి దింపుతాడు. అలాంటప్పుడు హీరోయిన్ విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాలా? ఫలానా పాత్రకు సరిగ్గా సూటవుతుందా? లేదా? అని ఒకటికి పదిసార్లు లెక్కలేసుకొని.. స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపుతాడు. ఒకవేళ నిడివి చిన్నదైనా సరే, స్టార్లనే తీసుకుంటాడు. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా విషయంలోనూ ఆ స్ట్రాటజీలనే జక్కన్న అనుసరిస్తున్నాడని…
రచయితగా ‘సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ లాంటి చిత్రాలకు సంభాషణలు అందించి ‘బుర్రకథ’తో దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు ఇప్పుడు బిగ్ బాస్ విజేత వీజే సన్ని హీరోగా ‘అన్ స్టాపబుల్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మే 31వ తేదీ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు బి. గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్,…
బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. ఇక బాహుబలి పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ఎండ్ చేసి బాహుబలి 2 కోసం ఎంతగానో ఎదురుచూసేలా చేసిన క్రెడిట్ రాజమౌళికి ఎంత ఉందో, అయన తండ్రి, రైటర్ విజేయద్రప్రసాద్ కు కూడా అంతే ఉంది. ఫాంటసీ, చరిత్ర కథలను రాయడంలో విజయేంద్ర ప్రసాద్ దిట్ట. ఇక ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్…
ప్రముఖ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు, దర్శకుడు ప్రసన్నకుమార్, నటులు జీవితా రాజశేఖర్,సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, హీరో సంపూర్ణేష్ బాబు, గణేష్ మాస్టర్ ల చేతుల మీదుగా “సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్” ఘనంగా ప్రారంభమైంది. సినిమాలో నటించాలంటే డైలాగ్స్, డ్యాన్స్ ఉంటే సరిపోదు వీటికి తోడు యాక్టింగ్, ఫైటింగ్ ఇలా ఎన్నో రకాల మెళుకువల్లో శిక్షణ పొందాలి. అలాంటి వారికోసం అన్నీ ఒకే చోట శిక్షణ ఇచ్చేలా సరికోత్త ఇన్స్ట్యూట్ మనముందుకు వచ్చింది. డ్యాన్సర్…
నవతరం ప్రేక్షకుల నాడిని పట్టి కథలు వినిపిస్తున్న మేటి రచయిత ఎవరంటే ఇప్పట్లో విజయేంద్రప్రసాద్ పేరునే చెబుతారు జనం. తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన బాహుబలి సీరిస్ విజయేంద్రప్రసాద్ కలం నుండే చాలువారింది. ఆయన రచనలతో అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లోనూ విజయేంద్రప్రసాద్ రచనలు జనాన్ని మెప్పించాయి. విజయేంద్రప్రసాద్ రచనలతో తెరకెక్కే సినిమాల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. విజయేంద్రప్రసాద్ పూర్తి పేరు కోడూరి…
రవితేజ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ సినిమా రవితేజ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. పోలీస్ పవర్ ను చాటిన సినిమాలలో ‘విక్రమార్కుడు’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. రవితేజను ద్విపాత్రాభినయంలో అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. 2006 వచ్చిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కథానాయిక. దీనిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా అక్కడా జయకేతనం ఎగురువేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు వినిపిస్తోంది. హీరోగా రవితేజ…
అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. అపర్ణ మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ. వి. ఆర్. స్వామి నిర్మాత. ఆగస్ట్ 28న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. ఒక్కడేదో…
పలు సూపర్ హిట్ చిత్రాల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో ఋషిలా కనిపిస్తున్నారాయన. అయితే ఈ లుక్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అంశానికి కేంద్రబిందువు అయింది. మనదేశ ప్రధాని నరేంద్ర మోడి సైతం గత కొంత కాలంగా పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఓ యువ రచయితలో కొత్త ఆలోచన పుట్టడానికి కారణమైంది. Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్…
రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” కోసం కథ రాసిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ విషయం చెప్పి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక లుక్ లో కన్పించనున్నారట. అది చూస్తే మెగా అభిమానులు సంతోషపడడం ఖాయం అంటున్నారు. ఇంతకీ ఆ లుక్ ఏమిటంటే చరణ్ ఈ చిత్రంలో పోలీస్ గెటప్ లో కన్పించబోతున్నాడట. “ఆర్ఆర్ఆర్లో చరణ్ పోలీసు అవతారం వెనుక ఒక క్లిష్టమైన కథ…