వచ్చే నెలలో ‘పెళ్లికూతురు పార్టీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. అపర్ణ మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ. వి. ఆర్. స్వామి నిర్మాత. ఆగస్ట్ 28న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. ఒక్కడేదో పెళ్లి వాతావరణం కనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ అలాంటి వాతావరణం కనిపించలేదు. పోనీ పార్టీ ఏమైనా ఇస్తారేమో అనుకుంటే అదీ లేదు. అయితే మంచి ట్రైలర్, సాంగ్స్‌తో మెప్పించారు. చాలా బావున్నాయి. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
Also Read
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
డైరెక్టర్ అపర్ణ మల్లాది మాట్లాడుతూ ”విజయేంద్ర ప్రసాద్‌గారు నాకు మెంటర్, గురు, ఫ్రెండ్! ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ఇదో రొమాంటిక్ కామెడీ, అడ్వెంచర్ జోనర్ మూవీ. ఫిమేల్ ప్రొటాగనిస్ట్ సినిమా. అనీషా దామా ఇందులో మెయిన్ పాత్ర చేశారు. ‘మహర్షి, ఓ బేబి, గీత గోవిందం’ చిత్రాల్లో ఈమె నటించారు. ఆమెకు జోడీగా ప్రిన్స్ యాక్ట్ చేశారు. ఇందులో అన్నపూర్ణమ్మ చాలా కీలక పాత్రను పోషించారు. ఈ మూవీ ద్వారా భావన వజపండల్ అనే మరో హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పవన్ సురేశ్ ఈ చిత్రంలో కామెడీ విలన్‌గా కనిపిస్తారు. ఇందులో నటించిన వారందరూ తెలుగు అమ్మాయిలే. మా సినిమాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రిన్స్, సాయికేతన్, అర్జున్ కళ్యాణ్‌కు థాంక్స్. ‘కేరాఫ్ కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన స్వీకర్ అగస్తి ఈ సినిమా సంగీతాన్ని సమకూర్చారు. నరేన్ ఎలాన్ ఈ సినిమాకు విజువల్స్ అందించారు” అని చెప్పారు.
అనీషా దామ మాట్లాడుతూ, ”ఏడాది ముందు ఈ ‘పెళ్లికూతురు పార్టీ’ జర్నీని స్టార్ట్ చేశాం. నాపై నమ్మకంతో నాకు మెయిన్ లీడ్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అపర్ణగారికి, నిర్మాత స్వామిగారికి థాంక్స్” అని అన్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ లో జనం ముందుకు తీసుకురాబోతున్నట్టు నిర్మాత ఎ.వి.ఆర్. స్వామి తెలిపారు.

తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!