CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోవడంతో పాటు.. అమ్మవారి దేవస్థానంతో పాటు కనక దుర్గ నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.. ఇక, తన విజయవాడ పర్యటన కోసం రేపు ఉదయం 8.20 గంటలకుతాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్.. కనకదుర్గమ్మ వారి దేవస్థానం, కనక దుర్గ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఆయన.. అనంతరం ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారు.. అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి తిరుగు ప్రయాణం అవుతారు.
Read Also: Top Headlines @ 9 PM : టాప్ న్యూస్
ఇక, ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు రేపు ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు మంత్రి కొట్టు సత్యన్నారాయణ.. సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. రేపు సీఎం జగన్ పలు పనులకు శంకుస్థాపనలు చేస్తారు.. ఆ అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి 18 నెలలు పడుతుందని వివరించారు. మరోవైపు గత ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు తమ ప్రభుత్వంలో చేస్తున్నామని తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాగా, నిత్యం ఏదో ఒక కార్యక్రమం లేదా పర్యటనలతో బిజీగా గడపుతున్నారు సీఎం వైఎస్ జగన్.. రేపు ఉదయం ఆయన విజయవాడలో పర్యటించబోతున్నారు.