Vijayawada : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు సహకరించిన ఏపీ ప్రభుత్వానికి అభినందనలు ఆమె ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుంచీ తెలుగు వింటూ జీవించాను. దేశ విదేశాల్లో గుర్తింపు రావాలంటే చెన్నై, తమిళనాడు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండేది. మొవ్వ, తంజావూరు, రాజమండ్రి, బొబ్బిలి లాంటి ప్రాంతాలు ప్రతి వారు గుర్తుంచుకోవాలి. కార్తీక మాసంలో ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం జరగాలి. ఈ గానామృతం ప్రతీ సంవత్సరం దేశ విదేశాలకు వెళ్ళాలి. తెలుగు వింటేనే ఎంతో అద్భుతమైన భావం కలిగిస్తుంది. లాక్ డౌన్ సమయంలో సంగీతం నేను ఆస్వాదించాను. సంగీతాన్ని వైద్యంలో కూడా వినియోగిస్తున్నారు. విదేశాల నుంచీ తెలుగువారు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్మలా సీతారామన్ కోరారు.
Read Also:Anti-Semitism: యూదులు దెబ్బ అదుర్స్.. యూఎస్ టాప్ వర్సిటీ ప్రెసిడెంట్ రాజీనామా..
కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్ కు మంత్రి ఆర్కే రోజా అభినందనలు తెలిపారు. నిర్మలా సీతారామన్ చాలామంది మహిళలకు ఆదర్శమన్నారు. మహిళగా ఎదగడానికి ఎన్నో ఆటంకాలుంటాయి. కృష్ణవేణి సంగీత నీరాజనం ఈతరం వారికి ఒక గొప్ప అవకాశం. కర్నాటక సంగీతం తెలుగునేల మీద విరాజిల్లుతూనే ఉండాలన్నారు మంత్రి రోజా. సంగీతం ఎలాంటి భావాన్నైనా ప్రతిబింబించేందుకు ఒక అస్త్రం లాంటిదన్నారు. మూడు రోజులపాటు ఈ కృష్ణవేణి సంగీత నీరాజనం జరుగుతుంది. ఒకవైపు కృష్ణమ్మ పరవళ్ళు, మరోవైపు సంగీతం మనల్ని పరవశింపజేస్తాయని రోజా అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పాల్గొన్నారు.
Vijayawada :Kagaznagar Train: రైలులో పొగలు.. చైన్ లాగిన ప్రయాణికులు.. ఆ తరువాత..!