టాలివుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ఈ క్రమంలో చిత్రయూనిట్ విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుంది. హీరో వెంకటేశ్, దర్శకుడితోపాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సినిమా విజయవంతం అయ్యేలా చూడాలని అమ్మవారిని చిత్రయూనిట్ బృందం వేడుకుంది. ఆలయ అధికారులు, గౌరవమర్యాదలను చేశారు.. వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.. వెంకటేష్ వస్తున్నారాన్న సంగతి తెలుసుకున్న అభిమానులు గుడి ఆవరణలో క్యూ కట్టారు.. సెల్ఫీలు దిగారు.. అనంతరం విజయవాడలో బాబాయ్ హోటల్ లో సందడి చేశారు..టిఫిన్ చేసేందుకు బాబాయ్ హోటల్ కు వచ్చిన వెంకటేష్ తో స్థానికులు సెల్ఫీలు దిగారు.. అక్కడ సందడి వాతావరణం నెలకొంది.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఇకపోతే హిట్, హిట్2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సైంధవ్ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ నటుడు ఆర్య, రుహానీ శర్మ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు..