ఏపీలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గనేలేదు.. థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. దీంతో.. థర్డ్ వేవ్ వస్తే ఎలా..? చిన్నారులు ఎక్కువ మంది కోవిడ్ బారినపడితే ఏం చేద్దాం అనే దానిపై ఫోకస్ పెట్టాయి ప్రభుత్వాలు.. ఇక, ఏపీ ప్రభుత్వం చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రినే నిర్మించాలని నిర్ణయానికి వచ్చింది.. ఏపీలో 20 ఏళ్ల లోపు 11.07 శాతం మంది ఉన్నారని తెలిపిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. మూడో దశలో 20 ఏళ్ల లోపున్న వారికి రెండింతల కేసులు నమోదైనా చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.. చిన్నారులకు కరోనా సోకితే ఎలాంటి చికిత్స అందించాలని.. మందుల వినియోగం, మాస్కుల లభ్యత వంటి వాటిపై ఫోకస్ పెట్టినట్టు వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా మూడో దశ కరోనాలో చిన్నారులకు చికిత్స అందించే అంశంపై అధ్యయనం చేస్తున్నామన్న ఆయన.. చిన్న పిల్లలు పాజిటివ్ అయితే తల్లులు కూడా ఉండాల్సి వస్తుంది.. అలాంటి వారికి 45 ఏళ్ల వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు..
ఇక, విశాఖలో 500 బెడ్లతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు అనిల్ కుమార్ సింఘాల్.. డీపీఆర్ కూడా సిద్ధంగా ఉందని.. వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.. మరోవైపు విజయవాడ, తిరుపతిల్లో కూడా పిడీయాట్రిక్ ఆస్పత్రుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని.. పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులను కూడా మూడో దశ కరోనా చికిత్స కోసం సన్నద్ధం చేస్తున్నామన్నారు.. అవసరమైన మేరకు పిడీయాట్రీషీయన్సుని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తామని వెల్లడించారు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..