విజయవాడ దుర్గగుడి లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపుతున్నాయి. దుర్గగుడి లో పనిచేస్తున్న ఇద్దరు ఆలయ ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందారు. తాజాగా అధికారుల విచారణలో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం బయటపడింది. దుర్గగుడిలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజు జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందినట్లు గుర్తించి వారిని సస్పెండ్ చేసారీ ఆలయ ఈఓ. సస్పెండ్ చేసిన ఆ ఇద్దరు పైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు మొత్తం ఆలయ ఉద్యోగుల సర్టిఫికెట్లను పరీక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఇంకా ఎవరైనా పట్టుబడుతారా.. లేదా అనేది.