కెసిఆర్ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్ అయ్యారు. “తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాల్ని గమనిస్తే చాలు. రాష్ట్రంలో భూములమ్మి ఎలాగేనా వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతోంది. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ గారు… నేడు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సర్కారు భూమి అన్నదే లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అత్యంత కీలకమైన…
ఆ సినిమా స్టార్.. తర్వాతి కాలంలో పొలిటికల్ స్టార్ అయ్యారు. ఆ మధ్య కండువా మార్చి.. పాత గూటిలో సరికొత్తగా ప్రయాణం మొదలుపెట్టారు కూడా. ఇప్పుడు సోషల్ స్టార్‌గా న్యూ రోల్ పోషిస్తున్నారు. పార్టీలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారి.. ఫోకస్‌లోకి వస్తున్నారట. ఇంతకీ ఎవరా లీడర్? ఏమా కథ? బీజేపీలో గేర్ మార్చిన రాములమ్మ తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మ పాత్ర ప్రత్యేకం. సొంత పార్టీ పెట్టి.. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీ అయ్యారు. ఆపై కాంగ్రెస్‌లో…
ప్రధాని మోడీపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బిజేపి నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజం ఒవైసీ జీ.. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయని చురకలు అంటించారు విజయశాంతి. “2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS…
మంత్రి కేటీఆర్ పై బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కేటీఆర్ కు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? అని ప్రశ్నించారు రాములమ్మ. వ్యాక్సిన్ అనేది గంటలలోనో… రోజులలోనో… ఉత్పత్తి అయి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదని… అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి సరైన విజ్ఞత లేదని…
బిజెపిలో ఈటెల చేరికపై అన్ని పార్టీలు స్పందిస్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ లు స్పందించగా తాజాగా బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల బీజేపీలో చేరతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్నారని మండిపడ్డారు. “సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు లేరన్న ఈటల గారి ప్రకటనపై ముందుగా ఎందుకు చెప్పలే…. అని టీఆరెస్ ప్రతి విమర్శలు చేసే బదులు, వెంటనే నియామకం చెయ్యవచ్చు. సమర్థులైన ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు ఉన్నారు కదా? సీఎం…
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుటుందో తెలంగాణ.. ఈ సమయంలో.. తమ వల్లే రాష్ట్రం సాధ్యమైందనే.. తాము లేకపోతే రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని ఎవ్వరికి వారు చెప్పుకుంటున్నారు.. తాజాగా తెలంగాణ ఉద్యమంపై స్పందించిన బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర ఆలోచన మొదట బీజేపీదే అన్నారు.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పింది బీజేపీయేనని ఆమె గుర్తుచేశారు.. ఇక, తెలంగాణ ఉద్యమంలోకి టీఆర్ఎస్ లేట్‌గా వచ్చిందని కామెంట్ చేశారు.. కేసీఆర్ ఉద్యమ సమయంలో…
సీఎం కేసీఆర్ పై బిజేపి నేత విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ లో అణువణువునా అహంకారం ఉందని మండిపడ్డారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ గారిలో అణువణువునా నిండిన అహంకారం ఫలితం ఏమిటో నేటి మీడియా కథనం చూస్తే అర్థమవుతుంది. విపక్షాలు ఎంతగా చెప్పినా… ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా వినకుండా పట్టుదలకు పోయి ఈ సర్కారు నిర్వహించిన పలు ఎన్నికల వల్ల పలువురు ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది కరోనా బారిన పడి…
సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సమస్యలు కెసిఆర్ కు కనిపించడం లేదా అని నిప్పులు చేరిగారు. “తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారు. మూడు నాలుగు వారాలుగా ధాన్యం అమ్మకాలు లేకపోవడంతో రైతులు కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు అకాలవర్షాలతో రైతులు గజగజలాడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం గారు మాత్రం ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు….…
సిద్దిపేట అభివృద్ధిపై విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సిద్దిపేట లో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా.? అని ప్రశ్నించిన ఆమె.. సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు.. కోవిడ్ నిబంధనలకు లోబడి పీపీఈ కిట్స్ వేసుకుని ఆస్పత్రిలోకి వెళ్తే.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు బనాయిస్తారా? రోజు లాక్ డౌన్…
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని…