మంత్రి ఎర్రబెల్లిపై విజయశాంతి విజయశాంతి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. మంత్రి ఎర్రబెల్లికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని చురకలు అంటించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక చుక్కలు చూపించారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు. తమ ఉద్యోగాల పేరులో మాత్రమే “ఉపాధి హామీ” ఉంది తప్ప… విధులకు తమను దూరం పెట్టి పగ సాధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కరోనా కష్టకాలంలో పనిలేక, జీతం రాక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని రోదిస్తూ శాపనార్థాలు పెట్టారు. బంగారు తెలంగాణ ఇదేనా? అని మండిపడ్డారు. పిల్లలకు సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నామని మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లు మీడియా ముందు తీవ్ర వేదనకు గురయ్యారు. తన కళ్ళముందే ఇంత జరుగుతున్నా వారి సమస్యను తాను పరిశీలిస్తానని గాని, సీఎం దృష్టికి తీసుకెళతానని గాని కనీస హామీ ఇచ్చేందుకు కూడా ఆ మంత్రిగారు ధైర్యం చెయ్యలేని దుస్థితి కనిపించింది. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కుటుంబాలు తప్ప ఒక్క వర్గం కూడా సంతృప్తిగా బతుకుతున్న దాఖలా లేదు. పంటల కొనుగోళ్ళు లేక రైతులు… ఉద్యోగాల్లేక ఆత్మహత్యల బాటలో నిరుద్యోగులు… ఇలా తెలంగాణలో ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అనే పరిస్థితి నెలకొంది. అధికార పార్టీని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా… అని ప్రజలు ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!