మరోసారి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీ మంత్రులపై బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. “తెలంగాణ మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పే కల్లబొల్లి కబుర్లలోని మాయలేంటో జంటనగరాల ప్రజలకు బాగా తెలుసు… వానలు పడినప్పుడల్లా కాల్వల్ని తలపించే హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులు, నాలాల బారిన పడి జనం విలవిలలాడుతుంటే…. వర్షాలు తగ్గగానే ఈ సమస్యలు మళ్ళీ తలెత్తకుండా చూస్తామంటూ గత ఏడేళ్ళ నుంచి పాలకులు చెబుతుండటం… జనం వింటుండటం మామూలైపోయింది. ఇప్పుడు వరంగల్ ప్రజలకు…
తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై బీజేపీ నేత విజయశాంతి తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు. తెలంగాణలో 50 వేల ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తామంటూ ఎప్పుడో 7 నెలల కిందట ప్రకటించిన కేసీఆర్ కు…. ఉన్నట్టుండి నిరుద్యోగులపై ప్రేమ పుట్టి వెంటనే కొలువుల భర్తీకి చర్యలంటూ నేడు మళ్ళీ ప్రకటన చేశారనుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకటుండదని ఫైర్…
సీఎం కేసీఆర్ పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు తెలంగాణ జిల్లాలకు బొక్కలు… సిద్దిపేట్, సిరిసిల్లలకు మాత్రం ముక్కలు అన్న తీరుగా నడుస్తున్నాయని మండిపడ్డారు. పల్లెలన్నిటికీ మొక్కలు పెంచే పని ఇచ్చి, కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లో మాత్రం నిధుల చెక్కులు పంచే కార్యక్రమం పెట్టుకున్నారని చురకలు అంటిం చారు. ఇంతకు ముందు హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లలో చేసిన వాగ్దానాలు ఏవీ అమలు చేయలేదని ఫైర్ అయిన విజయశాంతి…తాను గతంలో చెప్పిన…
కరోనా మహమ్మారి వెటకారంగా మాట్లాడుతున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… జూబ్లీహిల్స్ శ్రీరాంనగర్‌లోని వ్యాక్సిన్ సెంటర్‌ను పరిశీలించిన ఆమె.. వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా గురించి సీఎం కేసీఆర్ వెటకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇప్పటికైనా కేసీఆర్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించిన ఆమె.. సీఎం బాధ్యతగా ఉండి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికావన్నారు. పారాసిట్మాల్ తో కరోనా తగ్గితే యశోదా ఆస్పత్రిలో ఎందుకు చికిత్స…
దర్భంగా పేలుళ్ళపై బీజేపీ నేత విజయశాంతి తన దైన శైలిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి బట్టబయల య్యాయని… దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా హైదరాబాదుతో లింక్ ఉండటం కలవరపరుస్తోందని పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ తెలంగాణ సర్కారును అప్రతిష్టపాలు చేసే సిగ్గుచేటైన పరిణామాలు తప్ప మరొకటి కాదని… హైదరాబాదును విశ్వనగరం చేస్తామని ఏడేళ్ళుగా గప్పాలు కొడుతూ నెట్టుకొస్తున్న సీఎం కేసీఆర్ గారి సమర్థత ఈ నగర…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి పైర్ అయ్యారు. దళిత సాధికారత పేరుతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై వెల్లువెత్తిన నిరసనలతో సీఎం కేసీఆర్ గారికి ఒక్కసారిగా దళిత సాధికారత గుర్తుకొచ్చిందా? అని నిలదీశారు. ఈ ఘటనపై పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలను చల్లార్చడం కోసం అన్నట్టుగా రూ.1000 కోట్ల నిధులతో దళిత సామాజిక వర్గానికి ఏదేదో చేసేద్దామన్న ఆలోచనల్లో ఆయన ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించారు.…
(జూన్ 24న విజయశాంతి పుట్టినరోజు)విజయశాంతి మళ్ళీ నటిస్తున్నారని తెలియగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. ఇక విజయశాంతి మునుపటి అభినయాన్ని ప్రదర్శించగలదా – అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇలా విజయశాంతి రీ ఎంట్రీపై చర్చోపచర్చలు సాగాయి. ఎన్ని చర్చలు సాగినా, విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ లో తనదైన బాణీ పలికించి, తనకు తానే సాటి అనిపించుకున్నారు. 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలచిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఆ స్థాయి విజయాన్ని సాధించడానికి విజయశాంతి రీ ఎంట్రీ కార్డ్…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి సెటైర్ వేశారు. అచ్చమైన తెలంగాణ భాషలో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా కరోనాకు పారాసిటమల్ చాలంటున్రు. జయశంకర్ గారి వర్ధంతిని జయంతి అంటున్రు. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి ఊసెత్తకుండా… ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నరు. డల్లాస్, చికాగో, న్యూయార్క్, ఇస్తాంబుల్ వాగ్దానాల యాది మరిచి, ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటున్రు. వీటిలో ఏ ఒక్కటీ…
బీజేపీ నేత విజయశాంతి మరోసారి సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఎలా ఎత్తేస్తారని ఆమె ప్రశ్నించారు. ” తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని, ఇట్టే మోసం చెయ్యవచ్చనేది సీఎం కేసీఆర్ గారి గట్టి విశ్వాసం. నిన్నటి వరకూ కరోనా పేరిట పగలు కొన్ని గంటల పాటు, రాత్రి మొత్తం లాక్‌డౌన్ పెట్టి… చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ కరోనా కట్టడికి ఎలాంటి చర్యలూ ప్రకటించకుండానే ఉన్నట్టుండి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశారు.…
మంత్రి ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. మంత్రి ఎర్రబెల్లికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని చురకలు అంటించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక చుక్కలు చూపించారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు. తమ ఉద్యోగాల పేరులో మాత్రమే “ఉపాధి హామీ” ఉంది తప్ప… విధులకు తమను దూరం పెట్టి పగ సాధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కరోనా కష్టకాలంలో…