కుంభకర్ణుడిలా నిద్ర లేచారు…రైతుల ఏడుపులు కనిపించడం లేదా? : విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సమస్యలు కెసిఆర్ కు కనిపించడం లేదా అని నిప్పులు చేరిగారు. “తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారు. మూడు నాలుగు వారాలుగా ధాన్యం అమ్మకాలు లేకపోవడంతో రైతులు కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు అకాలవర్షాలతో రైతులు గజగజలాడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం గారు మాత్రం ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు…. లేవగానే హడావుడిగా గాంధీ, ఎంజీఎం హాస్పిటల్స్ పోయి షో చేసి వచ్చిండ్రు. ఒక్క పైసా ఇయ్యలే, ఒక్క సమస్య తీర్చలే. పైనుంచి హెలికాఫ్టర్‌లోనే పోయిండ్రు కదా… కింద రైతులు ధాన్యం పోసుకుని, తడిచిన ధాన్యం దగ్గర కూర్చుని ఏడుస్తున్న దృశ్యాలు కనిపించే లేదా? రైతునని చెప్పుకునే సీఎం, వరంగల్‌కు పోయేటప్పుడో, వచ్చేటప్పుడో రోడ్డు మార్గాన వచ్చి, రైతుల్ని కలిసి ఉంటే తెలిసేది. రైతు ధాన్యం తడిచిపోవడానికి ఈ ప్రభుత్వానిదే బాధ్యత. ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి ఉంటే ఇంతగా ధాన్యం తడిచిపోయేది కాదు. రైతులకు ఎదురవుతున్న సమస్యల్ని చెప్పుకునేందుకు ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. వర్షానికి భయపడి రైతులు అడ్డికి పావు సేరు ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇంకో రెండు వారాల్లో వర్షాకాలం ప్రారంభం కాబోతోంది. ఆ లోగా కల్లాలను ఖాళీ చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతు కష్టాలు వెంటనే పరిష్కారం కావాలన్న ఆకాంక్షతో సోమవారం (24-05-2021వ తేదీ) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు “తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష” చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!