(అక్టోబర్ 9న ‘అపూర్వ సహోదరులు’కు 35 ఏళ్ళు)నందమూరి బాలకృష్ణ నటజీవితంలో ఒకే యేడాది ఆరు వరుస విజయాలు చూడటం అన్నది మరపురాని విజయం. 1986లో ఈ విశేషం చోటు చేసుకుంది. ‘ముద్దుల క్రిష్ణయ్య’తో ఆరంభమైన ఆ ఘనవిజయం ‘అపూర్వ సహోదరులు’తో పూర్తయింది. 1986లో బాలకృష్ణ చివరి చిత్రంగా వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ అక్టోబర్ 9న దసరా కానుకగా జనం ముందు నిలచింది. బాలకృష్ణ నటనాపర్వంలో తొలి ద్విపాత్రాభినయ చిత్రంగానూ ‘అపూర్వ సహోదరులు’ నిలచింది. ప్రేక్షక హృదయాలను గెలిచింది.…
బీజేపీలో కీలకమైన జాతీయ కార్యవర్గ సభ్యులను నిన్నటి రోజున ప్రకటించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు కొంతమందికి కార్యవర్గంలో చోటు దక్కింది. వీరితో పాటుగా విజయశాంతికి కూడా కీలక పదవిని అప్పగించారు. విజయశాంతికి జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. జాతీయ పార్టీ తెలంగాణపై పూర్తి దృష్టి సారించేందుకు సిద్దమైనట్టు తెలుస్తున్నది. కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు పార్టీలో కీలక పదవిని కూడా అప్పగించడంతో తెలంగాణపై మరింత పట్టు సాధించవచ్చని పార్టీ…
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె… వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఎండగట్టారు.. ‘రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’…
(సెప్టెంబర్ 5న ‘సూర్య ఐపీఎస్’ కు 30 ఏళ్ళు) వెంకటేశ్, విజయశాంతి కలసి నటించిన ‘శత్రువు’ ఘనవిజయం సాధించింది. ఆ సినిమా తరువాత వారిద్దరూ జోడీగా నటించిన ‘సూర్య ఐపీఎస్’ చిత్రం జనం ముందు నిలచింది. ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడు. వెంకటేశ్, కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఇదే. దీని తరువాత ‘పోకిరి రాజా’ వచ్చింది. ఈ రెండు చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. వాటిలో ‘సూర్య ఐపీఎస్’ ఫరవాలేదని చెప్పవచ్చు. టి.సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఈ…
అధికార టీఆర్‌ఎస్ పార్టీ పై బీజేపీ నేత విజయశాంతి మరో సారి మండి పడ్డారు. ”పీసీసీ అధ్యక్షులు, టీఆరెస్ మంత్రిగారికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళ గురించి మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు మేడ్చల్ అసెంబ్లీ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడిన భాష, పదజాలం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదో అన్న చర్చ ఒకటైతే…. ఆ రాజీనామాలు జరిగి ఉపఎన్నికలు వస్తే తమకు ఈ టీఆరెస్ ముఖ్యమంత్రి ఏదో వరాలు అవసరార్థం తప్పనిసరై ఇవ్వచ్చేమో అనే…
అఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు చాలా దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే.. అఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. ఇటు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ..కూడా స్పందించి… తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలని రెండు రోజుల క్రితం ట్వీట్ చేశాడు. అయితే.. దీనిపై బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో…
దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ”ముఖ్యమంత్రిగారు దళిత బంధు పథకం నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయం… అయితే, గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు లాంటి అనేక హామీలు తుంగలోకి తొక్కడం… దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా ఊడపీకడం వంటి దళిత వ్యతిరేక చర్యల దృష్ట్యా కేసీఆర్ గారిని…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించి “సరిలేరు నీకెవ్వరు” అన్పిస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. మహేష్ బాబు చివరిసారిగా ఈ చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబుతో రష్మిక మండన్న మొదటిసారి కలిసి నటించింది. విజయశాంతి కీలకపాత్రలో నటించింది. తాజా అప్డేట్ ప్రకారం”సరిలేరు నీకెవ్వరు” చిత్రం…
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కి ఒక్కసారిగా హుజురాబాద్ నియోజకవర్గంపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందని… ‘తెలంగాణ దళిత బంధు పథకం’ ప్రకటించి, దీని అమలుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని మండిపడ్డారు. పథకం అమలులో నిర్లక్ష్యం కనబరిస్తే సహించేది లేదని అధికారులకు గట్టి హెచ్చరిక కూడా చేశారని… ఈ నిర్ణయం వెనుక లోగుట్టు ఏమిటో ప్రజలకు ఆమాత్రం తెలియదనుకుంటే అంతకంటే వెర్రితనం…
తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం అప్పుడు ఉద్యమించాం… ఇప్పుడు కేసీఆర్ను గద్దె దించేందుకు కార్యకర్తలు ఉద్యమంలా పనిచేయాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి చమరగీతం పడాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి, బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలన్నారు.. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకొని…