కేటీఆర్ గారు..!! మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? : రాములమ్మ సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్ పై బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కేటీఆర్ కు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? అని ప్రశ్నించారు రాములమ్మ. వ్యాక్సిన్ అనేది గంటలలోనో… రోజులలోనో… ఉత్పత్తి అయి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదని… అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి సరైన విజ్ఞత లేదని అర్థమవుతోందని మండిపడ్డారు. “ఎందుకంటే ప్రపంచంలో వ్యాక్సినేషన్ మొదలైందే గత డిసెంబర్ లో..! భారత్ లో జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. జనవరి 16 నుంచి మొదలు ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా టీకా డోసుల (వ్యాక్సినేషన్) పూర్తి చేశాం. ఇది అమెరికా కంటే ఎక్కువ. ఈ లెక్కలు తెలుసా కేటీఆర్ గారూ?” అంటూ చురకలు అంటించారు.
టీకాల పంపిణీపై టీఆర్ఎస్ సర్కారు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు అని… స్వదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయకుండా విదేశాలకు టీకాలు అమ్ముకొంటుందని కేంద్రంపై నిందలు మోపుతున్నవారికి బాధ్యత ఉందా..?అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం జీవితమే కమీషన్ల బాపతు అని ఫైర్ అయ్యారు. కరోనా విషయంలో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని… దీనిని తప్పించుకునేందుకే కేటీఆర్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై నిందలు మొపుతున్నారని ఆరోపించారు. కానీ, ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారని..భవిష్యత్తులో మీ పతనానికి మీరే గొయ్యి తవ్వుకుంటున్నారని గుర్తుపెట్టుకోవటం మంచిదని విజయశాంతి హెచ్చరించారు.
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- Tags
- ktr
- telangana
- vaccine
- vijayashanthi
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!