కరోనా విషయంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ… రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని ఆరోపించిన ఆమె.. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదని దుయ్యబట్టారు… పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడంలేదని మండిపడ్డారు. ఇక, కేసీఆర్.. ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించిన ఆమె..…
తెలంగాణ సర్కార్ పై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. కేంద్రం కరోనా డోసులు ఇచ్చినప్పటికీ ప్రజలకు ఇవ్వడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. “కోవిడ్ కట్టడి కోసం తెలంగాణకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్ 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు… రెండెసివర్ ఇంజెక్షన్లను 10 వేలకు పెంచినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ పై సర్కారు సన్నద్ధత, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు, కరోనాకు తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల పరిస్థితిపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో…
ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేయడంపై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ మానవత్వం లేకుండా వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు. “వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేసి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలూ తప్పుబడుతున్నా ఈ సర్కారు స్పందించడం లేదు. ఆస్పత్రులలో బెడ్స్ కన్ఫర్మ్ చేసుకుని, అందుకు రుజువులు…
కెసిఆర్ సర్కార్ పై మరోసారి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని మండిపడ్డారు. “తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని సీఎం కేసీఆర్ గారు పదేపదే నిరూపిస్తున్నారు. రాష్ట్రాన్ని దాదాపు నెలన్నరగా కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో వేధిస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు ఒక ప్రణాళిక లేకుండా ఆదరాబాదరాగా ఏం తోస్తే అది చేస్తున్నారు. వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభం… సిబ్బంది…
సిఎం కెసిఆర్ పై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కరోనా పరిస్థితి దారుణంగా ఉందని.. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. “తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని తేలిపోయింది. పగటి పూట నియంత్రణలేమీ లేవు. మరోవైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు స్వల్పకాల లాక్‌డౌన్ విధించాయి. మరి తెలంగాణ విషయానికి వచ్చే సరికి…
బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని మాట్లాడడం పట్ల తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై అసహ్యించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ నుండి 5 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది .ఇంకా 12 ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇచ్చిన…
కెసిఆర్ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. “తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతోంది. టెస్టుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదు. విద్యాసంస్థలను మాత్రం మూయించి సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్‌లు, క్లబ్‌లు, గుంపులు…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి కెసిఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కేసులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. “తెలంగాణలో కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సగం కారణమని స్పష్టమవుతోంది. గత మూడు నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వెల్లడైన పరిశోధనాత్మక నివేదికల్ని పరిశీలిస్తే కరోనా కేసుల విషయంలో సర్కారు ఎంత గుట్టుగా వ్యవహరిస్తోందో తెలుస్తుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రయివేటు ల్యాబ్స్‌లో చేస్తున్న పరీక్షలు… బులిటెన్ ద్వారా…