కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాలు పంచుకున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ హీరోలంతా తమవంతుగా భారీ విరాళాలను తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. తాజాగా ఈ జాబితాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేరిపోయారు. విజయ్ సేతుపతి ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు…